Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna45bc2f68-e10d-4cce-950a-80d9cbd30d8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna45bc2f68-e10d-4cce-950a-80d9cbd30d8a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రేంజ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాకిపోయింది. ఒక సాదాసీదా సీరియల్ డైరెక్టర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే చాలు అని భారతీయ చలనచిత్ర పరిశ్రమంలో ఉన్న అందరూ స్టార్ హీరోలు కోరుకునే విధంగా ప్రస్తుతం తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఉంటారు. వివాదాలకు దూరంగా క్రియేటివిటీకి దగ్గరగా ఉంటూ తన సినిమాలతో Jakkanna{#}Ram Charan Teja;Darsakudu;Magadheera;Hero;Chiranjeevi;Rajamouli;Director;Industry;India;Audience;Cinemaఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?Jakkanna{#}Ram Charan Teja;Darsakudu;Magadheera;Hero;Chiranjeevi;Rajamouli;Director;Industry;India;Audience;CinemaSun, 19 Feb 2023 14:30:00 GMTటాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రేంజ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాకిపోయింది. ఒక సాదాసీదా సీరియల్ డైరెక్టర్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పాలి. ఇక రాజమౌళితో ఒక్క సినిమా చేస్తే చాలు అని భారతీయ చలనచిత్ర పరిశ్రమంలో ఉన్న అందరూ స్టార్ హీరోలు కోరుకునే విధంగా ప్రస్తుతం తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఆయన ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటూ ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఉంటారు.


 వివాదాలకు దూరంగా క్రియేటివిటీకి దగ్గరగా ఉంటూ తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ అబ్బురపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే రాజమౌళి సినిమాలు అంటే దాదాపు రికార్డులు బద్దలు అయినట్లే అని సినీ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అయితే ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి రాజమౌళి ఎంత గొప్పగా చెబుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ అందరిలా సాదాసీదా హీరో కాదు. ఆయన ఒక శిఖరం అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు జక్కన్న. కానీ ఒకానొక సమయంలో మాత్రం రాజమౌళి చిరంజీవిపై సీరియస్ అయ్యారట.



 అప్పటివరకు అందరి లాగానే సాదాసీదా డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి మగధీర సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో తొలిసారి 50 కోట్లు వసూలు చేసిన సినిమాగా మగధీర నిలిచింది. దీంతో రెండో సినిమాతోనే అటు రామ్ చరణ్ కూడా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ సమయంలో రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని మెగా కాంపౌండ్ నుంచి ప్రచారం చేసుకున్నారట. దీంతో ఆ సమయంలో నేరుగా చిరంజీవి వద్దకు వెళ్ళిన రాజమౌళి సీరియస్ గా రియాక్ట్ అయ్యారట. తన కష్టాన్ని కనీసం గుర్తించలేకపోవడం ఏంటి అంటూ ప్రశ్నించారట ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని.. చిరంజీవి సర్ది చెప్పారట. తర్వాత స్వయంగా చిరంజీవి స్పందించి రాజమౌళి ప్రతిభను కొనియాడటం గమనార్హం.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>