Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahulc5668fe3-4d27-4814-bef8-5c1d4129cecd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rahulc5668fe3-4d27-4814-bef8-5c1d4129cecd-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియాలో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతను సీనియర్ కావడం.. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉండడంతో సెలెక్టర్లు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అయితే అతని కంటే మంచి ఫామ్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇక వారిని పక్కన పెట్టి మరి తుది జట్టులోకి కేఎల్ రాహుల్ ని తీసుకుంటున్నారు. అయితే ఇలా వరుస అవకాశాలు వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అని చRahul{#}rahul;BCCI;Rahul Sipligunj;K L Rahul;Paruguఅయ్యో మళ్లీనా.. అతన్ని జట్టు నుంచి పీకి పారేయండబ్బా?అయ్యో మళ్లీనా.. అతన్ని జట్టు నుంచి పీకి పారేయండబ్బా?Rahul{#}rahul;BCCI;Rahul Sipligunj;K L Rahul;ParuguSun, 19 Feb 2023 13:15:00 GMTటీమ్ ఇండియాలో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతను సీనియర్ కావడం.. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉండడంతో సెలెక్టర్లు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అయితే అతని కంటే మంచి ఫామ్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇక వారిని పక్కన పెట్టి మరి తుది జట్టులోకి కేఎల్ రాహుల్ ని తీసుకుంటున్నారు. అయితే ఇలా వరుస అవకాశాలు వచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పాలి.



 అతను ఆడుతుంది పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన లేకపోతే సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ అయిన కూడా అతని ఆటతీరులో మాత్రం ఎక్కడా మార్పు ఉండడం లేదు. ఓపెనర్గ బరిలోకి దిగి జట్టుకు శుభారంభాలు అందించాల్సింది పోయి సింగిల్ డిజిట్ స్కోర్కె వికెట్ కోల్పోయి పెవీలియన్ చేరుతూ ఉన్నాడు. అయితే  రాహుల్ ఇంతలా విఫలమవుతున్న అతనికి బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అన్నది మాత్రం ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్న.ఇక ఇటీవలే మరోసారి కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయాడు.


 ఇక ఇటీవలే రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి కాస్త టచ్ లోకి వచ్చాడు అనిపించిన అంతలోనే వికెట్ కోల్పోయి నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు తీసి నాథన్ లియోన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అతన్ని జట్టు నుంచి పీకి పారేసి శుభమన్ గిల్ లాంటి టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ ని జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా హిట్ అయ్యాక.. చిరంజీవిపై రాజమౌళి సీరియస్ అయ్యాడా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>