MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-21263fb8f-a0e7-4e0b-9539-2947b1e3b219-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda-21263fb8f-a0e7-4e0b-9539-2947b1e3b219-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్లో మొదటి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది.అలాగే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని, అయితే దాన్ని వీలు చూసుకుని తెరకెక్కిస్తామని బోయపాటి శ్రీను కూడా గతంలోనే తెలిపారు.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ అందించడం జరిగింది. మహా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్టులో ‘అఖండ’ సAKHANDA 2{#}Balakrishna;boyapati srinu;poorna;thaman s;Maha Shivratri;December;Blockbuster hit;Heroine;Sangeetha;Cinemaఅఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్?అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్?AKHANDA 2{#}Balakrishna;boyapati srinu;poorna;thaman s;Maha Shivratri;December;Blockbuster hit;Heroine;Sangeetha;CinemaSun, 19 Feb 2023 16:32:03 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్లో మొదటి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది.అలాగే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని, అయితే దాన్ని వీలు చూసుకుని తెరకెక్కిస్తామని బోయపాటి శ్రీను కూడా గతంలోనే తెలిపారు.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ అందించడం జరిగింది. మహా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్టులో ‘అఖండ’ సినిమా క్లిప్ను థమన్ షేర్ చేశారు. దీని క్యాప్షన్లో ‘Let’s meet soon in #Akhanda2’ అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అర్ధమవుతుంది.ఇక అఖండ సినిమా 2021 డిసెంబర్ 21వ తేదీన విడుదలై హిట్ కొట్టింది.


ఇంకా ఓటీటీలోకి వచ్చి 24 గంటలు గడవకముందే ఈ సినిమా మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి ఒక రేంజిలో స్పందన వచ్చింది. అఘోరా గెటప్ లో బాలకృష్ణ కనిపించే ప్రతిసారి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను సూపర్ గా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా కనిపించగా.. శ్రీకాంత్, జగపతిబాబు ఇంకా అలాగే పూర్ణ కీలకపాత్రలు పోషించారు.ఈ సినిమా కేవలం పది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకొని సత్తా చాటింది. ఇక రీసెంట్ గా బాలయ్య 'వీరసింహారెడ్డి' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా ఏకంగా 124 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

సెకండ్ సింగల్ పాడిన రవితేజ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>