EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu429e551b-6d9d-4647-8868-4498633f181a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu429e551b-6d9d-4647-8868-4498633f181a-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదంటున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని...తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిchandrababu{#}kalyan;Janasena;District;Vishakapatnam;Government;police;Telangana Chief Minister;YCP;CBNచంద్రబాబుకు ఫుల్‌ సపోర్ట్‌.. తేల్చేసిన పవన్‌ కల్యాణ్‌?చంద్రబాబుకు ఫుల్‌ సపోర్ట్‌.. తేల్చేసిన పవన్‌ కల్యాణ్‌?chandrababu{#}kalyan;Janasena;District;Vishakapatnam;Government;police;Telangana Chief Minister;YCP;CBNSat, 18 Feb 2023 08:56:39 GMTరాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదంటున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని...తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.


ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు గారిని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాం గానీ... విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.  సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని... అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.


జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో  ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారని... ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలుపెట్టారని... రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదని... ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.



RRR Telugu Movie Review Rating

అల్లు అర్జున్ కి ఉన్న.. ఆ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా?

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>