Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine8089e9c7-6fb4-4952-8ede-3f04aa68dcb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine8089e9c7-6fb4-4952-8ede-3f04aa68dcb7-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చేసింది కొన్ని సినిమాలు అయినా తమ అందం అభినయంతో కుర్ర కారు మతి పోగుడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించిన హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఈ హీరోయిన్ ను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. ఈ అమ్మడి పేరు శరణ్యమోహన్. తమిళ్ మలయాళం సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదింHeroine{#}Nani;annapurna;mohini;Audience;Doctor;Bheemili;dhanush;Telugu;Tamil;Car;Cinema;Heroine;septemberభీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి?భీమిలి కబడ్డీ జట్టు హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి?Heroine{#}Nani;annapurna;mohini;Audience;Doctor;Bheemili;dhanush;Telugu;Tamil;Car;Cinema;Heroine;septemberSat, 18 Feb 2023 09:15:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చేసింది కొన్ని సినిమాలు అయినా తమ అందం అభినయంతో కుర్ర కారు మతి పోగుడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో  నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించిన హీరోయిన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఇక ఈ హీరోయిన్ ను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. ఈ అమ్మడి పేరు శరణ్యమోహన్. తమిళ్ మలయాళం సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.



  2008లో ధనుష్ నయనతార నటించిన మోహిని అనే సినిమాలో నటించి కూడా గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో మొదటిసారి విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో నటించింది. అయితే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ  హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలోను నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలో హీరోయిన్గా నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు శరణ్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైంది.
 శరణ్య తన ప్రియుడు అయిన డాక్టర్ అరవింద కృష్ణన్ ను 2015 సెప్టెంబర్ ఆరవ తేదీన వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ జంటకు అన్నపూర్ణ అనే కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో సంతోషంగా లీడ్ చేస్తుంది ఈ హీరోయిన్. అయితే ఒకప్పుడు అందం అభినయంతో కుర్రకారు మతి పోగొట్టిన ఈ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసి అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

భోళా శంకర్:కీర్తి సురేష్ కు జోడిగా ఆ యంగ్ హీరోనా..?

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>