Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketce49f5ad-5283-4d6c-a242-ae99df2384e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketce49f5ad-5283-4d6c-a242-ae99df2384e9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిధ్య టీమిండియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై రాణించడం అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు పెద్ద సవాలుగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ముప్పు తిప్పులు పడుతున్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఇCricket{#}Australia;Steve Smith;Indiaపాపం.. కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసే ఔటయ్యారుపాపం.. కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసే ఔటయ్యారుCricket{#}Australia;Steve Smith;IndiaSat, 18 Feb 2023 11:00:00 GMTప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిధ్య టీమిండియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ లో ఉన్న స్పిన్ పిచ్ లపై రాణించడం అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు పెద్ద సవాలుగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ముప్పు తిప్పులు పడుతున్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఇక ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే పరుగులు రాబట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు అని చెప్పాలి.


 అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇక వరుసగా వికెట్లు కోల్పోయి అటు ఆస్ట్రేలియా జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా వరుసగా పెవిలియన్ చేరుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు వింతైన నెట్ ప్రాక్టీస్ చేయడం కూడా ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా వికెట్ల ముందు ఒకరు వికెట్ల వెనకాల ఒకరు నిలబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇలా స్మిత్, మార్నస్ లబుషేన్ ఇద్దరు కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఇద్దరూ కూడా వెంట వెంటనే అవుట్ అయ్యారు.


 స్టీవ్ స్మిత్ పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వినతిరిగితే.. ఇక  లబుషణ్ 18 పరుగులు చేసే చివరికి భారత బౌలింగ్ దాటికి వికెట్ సమర్పించుకుని పెవిలియన్ చేరాడు. అయితే ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరూ కూడా మ్యాచ్ కు ముందు అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియాతో ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. అయితే ఇలా కలిసి ప్రాక్టీస్ చేసిన ఇద్దరు బ్యాట్స్మెన్ ఇక ఇప్పుడు అధికారిక మ్యాచ్లో కూడా కలిసి అవుట్ అయ్యారు అంటూ సెటైర్ వేశాడు వసీం జాఫర్. అయితే ఇక రెండో టెస్టులో కవాజా 81, హాండ్స్ కాంబ్  72  మినహా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లందరూ కూడా చేతులెత్తేశారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

శివ ఆరాధనలో నిమగ్నమైన సమంత..!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>