Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankarc8c12e76-3d48-4dfb-a8ae-89d652000ec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankarc8c12e76-3d48-4dfb-a8ae-89d652000ec9-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ శంకర్.. ఈ పేరు కనిపించింది అంటే చాలు అదేదో అద్భుతమైన సినిమానే అయి ఉంటుందని సినీ ప్రేక్షకులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంతలా తన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ శంకర్. ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా శంకర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో విక్రమ్ నటన ఏ రేంజ్ లో ఉంటుందిShankar{#}Sada;ramu;shankar;vikram;Bike;Blockbuster hit;Aparichithudu;Audience;Tamil;Director'అపరిచితుడు' సినిమాలో.. శంకర్ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాడా?'అపరిచితుడు' సినిమాలో.. శంకర్ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాడా?Shankar{#}Sada;ramu;shankar;vikram;Bike;Blockbuster hit;Aparichithudu;Audience;Tamil;DirectorFri, 17 Feb 2023 08:20:08 GMTడైరెక్టర్ శంకర్.. ఈ పేరు కనిపించింది అంటే చాలు అదేదో అద్భుతమైన సినిమానే అయి ఉంటుందని సినీ ప్రేక్షకులందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంతలా తన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ శంకర్. ఇప్పుడు వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా శంకర్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో విక్రమ్ నటన ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది మాటల్లో వర్ణించడం చాలా కష్టం.


 ఒకే పాత్రలో మూడు రకాల షేడ్స్ చూపించి విక్రమ్ అటు సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. తమిళ సినిమా అయినప్పటికీ ఇక సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే, శంకర్ టేకింగ్,  పాటలు కూడా అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో రాము అనే పాత్ర అందరిని తెగ ఆకట్టుకుంటుంది. అయితే అపరిచితుడు సినిమాలో రాము పాత్ర విషయంలో డైరెక్టర్ శంకర్ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..


 రాము లాయర్ కావడంతో ఇక ఒకసారి బైక్ వైర్ తెగితే ఇక ఆ వైర్లో నాణ్యత లేదు అన్న కారణంతో చివరికి కంపెనీనే కోర్టుకు లాగుతాడు. దీంతో రాము అన్ని రూల్స్ పాటిస్తాడు అని అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ సినిమాలో రాము చాలా సార్లు బండి నడుపుతూ కనిపిస్తాడు. కానీ హెల్మెట్ పెట్టుకోడు. అయితే సినిమాలో లీనమైన ప్రేక్షకులు ఈ చిన్న విషయాన్ని గమనించరు. కానీ అన్ని రూల్స్ మాట్లాడే రాము హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు. శంకర్ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాడా అని నైటిజన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు..



RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. చినజీయర్‌ను వాడుకుని వదిలేశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>