HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/diabetes1f062ac1-2823-4dc0-8037-07fcba9ff86b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/diabetes1f062ac1-2823-4dc0-8037-07fcba9ff86b-415x250-IndiaHerald.jpgఅసలు ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ సమస్య అందరిని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఖచ్చితంగా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.ముఖ్యంగా వారు అసలు ఏది పడితే అది తినకూడదు , పండ్లను కూడా తినకూడదు.. ఇలా కొన్ని రకాల అపోహలను కలిగి ఉంటారు. చాలా మంది కూడా పండ్లు తింటే షుగర్ పెరుగుతుందని పండ్లలను తినడం మానేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధిని పెంచే అన్నం ఇంకా ఇడ్లీ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు.అయితే షుగర్ వ్యాధిని పెంచని పండ్లు కూడా ఉంటాయి. ఇక ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కుDIABETES{#}Idili;Cholesterol;Sugar;Manamషుగర్ దెబ్బకు తగ్గాలంటే..?షుగర్ దెబ్బకు తగ్గాలంటే..?DIABETES{#}Idili;Cholesterol;Sugar;ManamFri, 17 Feb 2023 20:39:42 GMTఅసలు ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ సమస్య అందరిని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఖచ్చితంగా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.ముఖ్యంగా వారు అసలు ఏది పడితే అది తినకూడదు , పండ్లను కూడా తినకూడదు.. ఇలా కొన్ని రకాల అపోహలను కలిగి ఉంటారు. చాలా మంది కూడా పండ్లు తింటే షుగర్ పెరుగుతుందని పండ్లలను తినడం మానేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధిని పెంచే అన్నం ఇంకా ఇడ్లీ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు.అయితే షుగర్ వ్యాధిని పెంచని పండ్లు కూడా ఉంటాయి. ఇక ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. నరాల మంటలు ఇంకా అలాగే తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. షుగర్ వ్యాధి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో పండ్లు  ఎంతగానో సహాయపడతాయి. బొప్పాయి, కర్బూజ, జామ, పుచ్చకాయ, కమలా, పైనాపిల్‌, ఆపిల్, దానిమ్మ, నేరేడు ఇంకా అలాగే రేగి పండ్లు వంటి పండ్లను తినడం వల్ల షుగర్ వ్యాధి పెరగకుండా చాలా ఈజీగా అదుపులో ఉంటుంది. ఈ పండ్లల్లో ఉండే చక్కెర  ప్రక్టోజ్ రూపంలో ఉంటుంది.ఆ చక్కెరలు వెంటనే రక్తంలో కలవకుండా ఉంటుంది.


ఇంకా మనలో చాలా మంది కూడా షుగర్ వ్యాధి జన్యుపరంగా తప్పకుండా వస్తుందని మన పెద్ద వారికి ఉంటే మనకు కూడా వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు.అది నిజమే. జన్యుపరంగా కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. జన్యుపరంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం వున్నా కూడా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ఇంకా వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మనం షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా జీవన శైలిలో మార్పుల కారణంగా తలెత్తే సమస్య  కనుక మన జీవన శైలిని ఇంకా అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమి లేదు. టైమ్ కి తినండి. కానీ తక్కువ తినండి. రాత్రి 10 గంటల లోపు పడుకోండి. పొద్దున్నే 6 గంటలకు మేల్కొని ఒక గంట వ్యాయామం చెయ్యండి. ఈ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోండి చాలు.. షుగరే కాదు.. ఏ వ్యాధి మీ దరి చేరదు.



RRR Telugu Movie Review Rating

తన రికార్డులను ఒక్కరోజులోనే బ్లాస్ట్ చేసిన ధనుష్ సార్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>