Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeb94e923e-05ae-4a05-a6d6-f127a1c142d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimeb94e923e-05ae-4a05-a6d6-f127a1c142d2-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకొస్తుంది అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది అన్నది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదాల నుంచి కూడా కొంతమంది రెప్పపాటు కాలంలో బయటపడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు ఇక ఇలా ప్రాణాలతో బయటపడిన వారిని మృత్యుంజయుడు అని అనడం మొదలు పెడCrime{#}Heartవాషింగ్ మిషన్ లో పడి.. ప్రాణాలతో బయటపడ్డ బుడ్డోడు?వాషింగ్ మిషన్ లో పడి.. ప్రాణాలతో బయటపడ్డ బుడ్డోడు?Crime{#}HeartFri, 17 Feb 2023 12:00:00 GMTఇటీవల  కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకొస్తుంది అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది అన్నది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదాల నుంచి కూడా కొంతమంది రెప్పపాటు కాలంలో బయటపడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు ఇక ఇలా ప్రాణాలతో బయటపడిన వారిని మృత్యుంజయుడు అని అనడం మొదలు పెడుతూ ఉంటారు అందరూ.


 ఇక్కడ ఒక ఏడాదిన్నర బుడ్డోడు కూడా తెలిసి తెలియక చేసిన పని చివరికి ప్రాణాల మీదికి తెచ్చింది. కానీ మృత్యుంజయుడిలా చివరికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఏకంగా టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసింది తల్లి. కానీ కాసేపటికి తన ఏడాది వహిస్తున్న పిల్లాడు కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది. ఇల్లంతా వెతికిన బుడ్డోడు కనిపించలేదు. దీంతో ఆ తల్లిలో ఇంకా కంగారు పెరిగిపోయింది. అంతలోనే మనసులో ఒక అనుమానం మెదిలింది. దీంతో వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూడగా అంతే ఆమె గుండె పగిలిపోయినంత పని అయింది.


 ఎందుకంటే వాషింగ్ మిషన్ లో ఆ బుడ్డోడు కనిపించాడు. ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే భయపడిపోయిన తల్లి ఇక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఇక ఆ చిన్నారి శరీరం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. స్పృహ కూడా లేదు. కానీ డాక్టర్లు అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లాడి పరిస్థితి గురించి వైద్య నిపుణులు హిమాన్షి మాట్లాడుతూ.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి నీలం రంగులోకి మారిపోయాడు. అవయవాలు కూడా పనిచేయడం మానేశాయి. నిమోనియాతో జీర్ణకోశ ఇన్ఫెక్షన్స్ అవుతుందని తెలిపారు. ఇక 12 రోజులు నుంచి కోమాలో ఉండి  తర్వాత వెంటిలేటర్ సహాయంతో చివరికి ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు అంటూ వైద్యులు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

భారీ ధరకే అమ్ముడుపోయిన సార్ ఓటీటి రైట్స్..!!

సార్ : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>