PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-kakinada-a0b7bec3-4d87-42c2-9f7a-f3969dd416dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-kakinada-a0b7bec3-4d87-42c2-9f7a-f3969dd416dc-415x250-IndiaHerald.jpgఆమధ్య స్ధానికసంస్ధల ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుని పోయింది. ఇందులో భాగంగానే కుప్పంలో కూడా అన్నీ చోట్లా ఓడిపోయింది. దీనిపై సమీక్ష చేస్తున్నపుడు ఒక నేత మాట్లాడుతు చంద్రబాబును కుప్పం ప్రజలు నాన్ లోకల్ అని అనుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడో ఒకసారొచ్చి రాజకీయాలు చేసే వాళ్ళని జనాలు ఎలా నమ్ముతారని చంద్రబాబు మొహంమీదే అడిగేశారు. కుప్పంలో రాజకీయం చేయాలని అనుకుంటే ముందు కుప్పంలో ఇల్లుండాలని సదరు నేత చెప్పారు. tdp chandrababu kakinada {#}Janasena;East Godavari;kuppam;vedhika;local language;politics;TDP;CBN;Hyderabad;Pawan Kalyan;Party;Houseగోదావరి : చంద్రబాబుకు కార్యకర్త వూహించని షాక్గోదావరి : చంద్రబాబుకు కార్యకర్త వూహించని షాక్tdp chandrababu kakinada {#}Janasena;East Godavari;kuppam;vedhika;local language;politics;TDP;CBN;Hyderabad;Pawan Kalyan;Party;HouseFri, 17 Feb 2023 03:00:00 GMT


చాలా కాలం తర్వాత చంద్రబాబునాయుడు మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో మూడురోజుల పర్యటన కోసం బిజీగా తిరుగుతున్నారు. కాకినాడలో జరిగిన నేతల సమావేశంలో ఒక నేత మాట్లాడుతు చంద్రబాబును గెస్ట్ పాలిటిక్స్ చేయవద్దని వేదిక మీదనే చెప్పారు. హైదరాబాద్ లో కూర్చుని ఏపీలో పాలిటిక్స్ చేయటం కాదని రాష్ట్రంలో ఒక ఇల్లు కట్టుకుని కుటుంబంతంతో పాటు వచ్చి ఉండాలని అందరి ముందు మైకులోనే చెప్పారు.





సదరు నేత చెప్పిన మాటకు చంద్రబాబు ఏమీ మాట్లాడలేక మౌనంగా తలూపుతు కూర్చున్నారు. పార్టీ అధినేత రాష్ట్రంలో ఇల్లు కట్టుకుని కుటుంబంతో పాటు నివాసముండాలన్నది పార్టీ నేతల కోరిక, సూచన, డిమాండుగా స్పష్టంగా చెప్పారు. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ఏపీలో పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే చంద్రబాబును మంత్రులు టూరిస్ట్ పాలిటీషియన్ అని గెస్ట్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేస్తుంటారు.





ఆమధ్య స్ధానికసంస్ధల ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుని పోయింది. ఇందులో భాగంగానే కుప్పంలో కూడా అన్నీ చోట్లా ఓడిపోయింది. దీనిపై సమీక్ష చేస్తున్నపుడు ఒక నేత మాట్లాడుతు చంద్రబాబును కుప్పం ప్రజలు నాన్ లోకల్ అని అనుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడో ఒకసారొచ్చి రాజకీయాలు చేసే వాళ్ళని జనాలు ఎలా నమ్ముతారని చంద్రబాబు మొహంమీదే అడిగేశారు. కుప్పంలో రాజకీయం చేయాలని అనుకుంటే ముందు కుప్పంలో ఇల్లుండాలని సదరు నేత చెప్పారు.






ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన 30 ఏళ్ళుగా కుప్పంకు ఎంఎల్ఏగా ఉన్నా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు సొంతిల్లు లేదు. వచ్చేఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో తాను లోకల్ అనిపించుకోవాలని అర్జంటుగా శాంతిపురం మండలంలోని ఒక గ్రామంలో 2 ఎకరాల స్ధలం కొనుక్కుని భూమిపూజ చేశారు. మరి ఇల్లు ఎప్పటికి కట్టుకుంటారో తెలీదు. ఇంత కాలానికి అలాంటి డిమాండే మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో వినిపించింది. తాజా డిమాండుతో చంద్రబాబు ఏమిచేస్తారో చూడాలి. చంద్రబాబే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా రాష్ట్రంలో పర్మినెంట్ అడ్రస్ లేదు.



 




RRR Telugu Movie Review Rating

ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల జోరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>