Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya68f3e18c-d91f-435d-9e8d-eb428ee003b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya68f3e18c-d91f-435d-9e8d-eb428ee003b9-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని మాస్ ప్రేక్షకులందరికీ కూడా తన సినిమాలతో పూనకాలు తెప్పిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కాగా కొంతకాలం నుంచి ఇక వరుస సినిమాలతో సూపర్ హిట్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వీరసింహారెడ్డి అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎంతలా సందడి చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాలయ్య గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ముఖ్యBalayya{#}Varsham;Mass;Balakrishna;Tollywood;Hero;producer;Producer;Cinemaరెండు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోలేదట.. నిజంగా బాలయ్య గ్రేట్?రెండు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోలేదట.. నిజంగా బాలయ్య గ్రేట్?Balayya{#}Varsham;Mass;Balakrishna;Tollywood;Hero;producer;Producer;CinemaThu, 16 Feb 2023 12:00:00 GMTసీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని మాస్ ప్రేక్షకులందరికీ కూడా తన సినిమాలతో పూనకాలు తెప్పిస్తూ ఉంటాడు అని చెప్పాలి. కాగా కొంతకాలం నుంచి ఇక వరుస సినిమాలతో సూపర్ హిట్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వీరసింహారెడ్డి అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎంతలా సందడి చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బాలయ్య గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది.


 ముఖ్యంగా నందమూరి బాలకృష్ణను బోలా మనిషి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బోలా అంటే మనసులో ఏముంటే అది బయటకి మాట్లాడేస్తూ ఉంటారు. అందరిలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడటం చేయరు. అంతేకాదు ఇక మనసుకు ఏది నచ్చితే అది వెనక ముందు ఆలోచించకుండా చేసేస్తూ ఉంటారు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. 60 ఏళ్లు దాటిన బాలకృష్ణలో ఇంకా చిన్నపిల్లాడు దాగున్నాడని అన్ స్టాపబుల్  కార్యక్రమంతో అందరికీ అర్థమైంది. అంతేకాదు ఇక బాలకృష్ణ తనపై ఎవరైనా పొగడ్తల వర్షం కురిపించారంటే చాలు ఇక వారికోసం ఏం చేయడానికి అయినా కూడా సిద్ధమైపోతూ ఉంటారట. అయితే బాలకృష్ణలో ఉన్న ఇలాంటి మంచి గుణాన్ని క్యాష్ చేసుకునే కొంతమంది నిర్మాతలు కొన్ని సినిమాలకు ఇక తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం.. ఇక మరికొన్ని సినిమాలకు అసలు రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం లాంటివి చేస్తూ ఉంటారట.



 ఈ క్రమంలోనే బాలయ్య మార్కెట్ విలువ దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు ఉన్న సమయంలో ఇక రెండు సినిమాలను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే చేశారట. ఇలా రెండు సినిమాలకు గాను ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ త్యాగం చేసేసాడట బాలకృష్ణ. డైరెక్టర్, నిర్మాత తనకు వీరాభిమాని అనే ఉద్దేశంతో ఇక ఇలా ఆ సినిమాల కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేశారట. ఇంతే కాదు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇక ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసి నిజంగానే మా బాలయ్య గ్రేట్ అంటూ అభిమానులు అనుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>