MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntrf5fe0222-bed8-4a8f-b263-9578db57deb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntrf5fe0222-bed8-4a8f-b263-9578db57deb3-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంగస్థలం నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత అనతి కాలంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా , దర్శకుడిగా , హీరోగా ఇలా ఎన్నో రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్నారు.. ఎన్టీఆర్ సినిమా అంటే ఆ రోజుల్లో మినిమం 100 రోజుల గ్యారెంటీ అన్నట్టుగా ప్రదర్శించబడేది. పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారు కూడా ఎన్టీఆర్ సినిమాల కSR.NTR{#}Venkatesh;Telugu Desam Party;Rangasthalam;Daggubati Venkateswara Rao;Service;Daggubati Purandeswari;central government;NTR;Silver;Teluguలెజెండ్రీ యాక్టర్ ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..!లెజెండ్రీ యాక్టర్ ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..!SR.NTR{#}Venkatesh;Telugu Desam Party;Rangasthalam;Daggubati Venkateswara Rao;Service;Daggubati Purandeswari;central government;NTR;Silver;TeluguThu, 16 Feb 2023 07:30:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఆయన ఇండస్ట్రీకి చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంగస్థలం నటుడిగా తన కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత అనతి కాలంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా , దర్శకుడిగా , హీరోగా ఇలా ఎన్నో రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్నారు.. ఎన్టీఆర్ సినిమా అంటే ఆ రోజుల్లో మినిమం 100 రోజుల గ్యారెంటీ అన్నట్టుగా ప్రదర్శించబడేది. పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారు కూడా ఎన్టీఆర్ సినిమాల కోసం థియేటర్ల వద్ద తెగ క్యూ కట్టేవారు. దీన్ని బట్టి చూస్తే ఆయన సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయో తెలుస్తుంది.

ఇక ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు.  అన్ని మంచి విజయం సాధించినవే.. ఇదిలా ఉండగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో తనకు తోడ్పడిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  అలా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పటికి ఆ పథకాలను అమలు అయ్యేలా ఆయన చేయగలిగారు అంటే ఆయన రాజకీయ పరిపాలన ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.  ఇకపోతే ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మ తో రూ.100 కాయిన్ ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

అయితే ఈ నాణెం పూర్తిగా వెండితో తయారు కానుంది అని సమాచారం. ఈ సందర్భంగా మింట్ అధికారులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి నమూనా చూపించారట.. పురందేశ్వరి కూడా ఈ వెండి నాణాన్ని,  దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ని కూడా పరిశీలించి ఓకే చేసినట్లు సమాచారం.  ఇక త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ వంద రూపాయల వెండి నాణెం బయటకు రానుంది అని కేంద్రం స్పష్టం చేసింది.



RRR Telugu Movie Review Rating

శభాష్‌ మోదీ.. సరిహద్దు గ్రామాలకు గుడ్‌న్యూస్‌?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>