Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3f137cd6-78e6-41b4-94f5-b3587d87c750-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3f137cd6-78e6-41b4-94f5-b3587d87c750-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు మంచి కాంబినేషన్స్ సెట్ అయినా ఆ కాంబోకి తగినట్టుగా సినిమాల అవుట్ పుట్ కానీ రిజల్ట్ కానీ రాదు. అయితే అలా జరిగినంత మాత్రానా ఆ కాంబో పై అనుమానాలు అక్కర్లేదు. ఒక ప్రాజెక్ట్ కి వర్క్ అవుట్ కాకపోతే మరో ప్రాజెక్ట్ లో సెట్ రైట్ అవుతుంది. ప్రస్తుతం ఇలాంటి మైండ్ సెట్ తోనే న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. Nani{#}atreya;Dussehra;Nani;Vijayadashami;RRR Movie;vivek;Venkatesh;Director;Cinema;Indiaఅతనితో నాని.. ఈసారి భారీగా..!అతనితో నాని.. ఈసారి భారీగా..!Nani{#}atreya;Dussehra;Nani;Vijayadashami;RRR Movie;vivek;Venkatesh;Director;Cinema;IndiaThu, 16 Feb 2023 15:06:00 GMTకొన్నిసార్లు మంచి కాంబినేషన్స్ సెట్ అయినా ఆ కాంబోకి తగినట్టుగా సినిమాల అవుట్ పుట్ కానీ రిజల్ట్ కానీ రాదు. అయితే అలా జరిగినంత మాత్రానా ఆ కాంబో పై అనుమానాలు అక్కర్లేదు. ఒక ప్రాజెక్ట్ కి వర్క్ అవుట్ కాకపోతే మరో ప్రాజెక్ట్ లో సెట్ రైట్ అవుతుంది. ప్రస్తుతం ఇలాంటి మైండ్ సెట్ తోనే న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అంటే సుందరానికీ అంటూ ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేశారు. సినిమా సింపుల్ గా బాగానే ఉంటుంది కానీ ఎందుకో కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అందుకే మరోసారి ఈ కాంబో రిపీట్ చేస్తున్నారు.

నాని దసరా రిలీజ్ తర్వాత నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే అని తెలుస్తుంది. ఓ పక్క శైలేష్ తో హిట్ 3 కూడా ఓకే చేసినా అతను ఎలాగు వెంకటేష్ తో సైంధవ్ చేస్తున్నాడు కాబట్టి ఈ గ్యాప్ లో నాని వివేక్ ఆత్రేయతో ఈ సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈసారి అంటే సుందరానికీ లా సింపుల్ గా కాకుండా భారీగానే సినిమా ప్లాన్ చేస్తున్నారట. నాని వివేక్ ఆత్రేయ కాంబో సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా ఉంటున్నారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

నాని కూడా ఈమధ్య సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. వివేక్ టాలెంట్ తెలుసు కాబట్టే అంటే సుందరానికీ సినిమా వర్క్ అవుట్ కాకపోయినా అతనికి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి మాత్రం భారీ బడ్జెట్ తో పర్ఫెక్ట్ స్టోరీతో వస్తున్నట్టు తెలుస్తుంది. నాని ప్లానింగ్ అంటే అలానే ఉంటుందని మరి అంటున్నారు అతని ఫ్యాన్స్. దసరాతో మాత్రం పాన్ ఇండియా వైడ్ గా దుమ్ముదులపాలని ఫిక్స్ అయ్యాడు నాని.





RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>