Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-460c8a2a-b4a8-4dc5-9821-ee705043c7a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-460c8a2a-b4a8-4dc5-9821-ee705043c7a1-415x250-IndiaHerald.jpgస్వీటీ అనుష్క ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. నిశ్శబ్ధం సినిమా తర్వాత అనుష్క ఫ్యాన్స్ అంతా కూడా ఆమె సినిమా కోసం ఎదురుచూడగా అమ్మడు మాత్రం సినిమాలు చేయకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. తన మనసుకి నచ్చిన కథలు రాక అనుష్క సినిమాలు ఒప్పుకోవట్లేదా లేక కావాలనే స్వీటీ సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అనుష్క సినిమాలకుAnushka{#}naveen polishetty;UV Creations;Anushka;Audience;anoushka;Telugu;Ishtam;Hero;Cinemaస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన అనుష్క..!స్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన అనుష్క..!Anushka{#}naveen polishetty;UV Creations;Anushka;Audience;anoushka;Telugu;Ishtam;Hero;CinemaThu, 16 Feb 2023 18:37:13 GMTస్వీటీ అనుష్క ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. నిశ్శబ్ధం సినిమా తర్వాత అనుష్క ఫ్యాన్స్ అంతా కూడా ఆమె సినిమా కోసం ఎదురుచూడగా అమ్మడు మాత్రం సినిమాలు చేయకుండా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. తన మనసుకి నచ్చిన కథలు రాక అనుష్క సినిమాలు ఒప్పుకోవట్లేదా లేక కావాలనే స్వీటీ సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అనుష్క సినిమాలకు గ్యాప్ ఇవ్వడం ఫ్యాన్స్ ని అసంతృప్తి కలిగించింది. అయితే వారిని మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అనుష్క నవీన్ పొలిశెట్టి సినిమాకు సైన్ చేసింది.

అది కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో కాబట్టే అనుష్క ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్య స్టార్ సినిమా ఆఫర్ కూడా అనుష్కకు రాగా దాన్ని కూడా సున్నితంగా తిరస్కరించిందట అనుష్క. మరి కమర్షియల్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యిందా లేక ఫలానా స్టార్ హీరో సినిమా మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యిందా తెలియదు కానీ అనుష్క రిజెక్షన్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క చేస్తున్న నవీన్ పొలిశెట్టి సినిమాలో కూడా ఆమె డామినేషన్ ఎక్కువగా ఉంటుందని టాక్.

ఇక సోలో సినిమాలకు కూడా అనుష్క ఓకే చెప్పే ఛాన్స్ ఉన్నా అంత గొప్ప కథలు తన దగ్గరకు రావట్లేదు కాబట్టే స్వీటీ లైట్ తీసుకుందని తెలుస్తుంది. ఏది ఏమైనా అనుష్క సినిమాలకు గ్యాప్ ఇవ్వడం ఆమె ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ అయ్యేలా చేస్తుంది. మరి వారి కోసమైనా అనుష్క వరుస సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరిస్తే బెటర్ అని అంటున్నారు. మరి అనుష్క మెచ్చే కథ వచ్చినా ఆమె చేస్తుందా లేక ఇష్టం లేకనే కథ బాగాలేదనే సాకు చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తెలుగు ఆడియన్స్ మాత్రం అనుష్కని బాగా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు.





RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>