HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf610626e-82e4-42fe-8a91-55a7ec05bf22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf610626e-82e4-42fe-8a91-55a7ec05bf22-415x250-IndiaHerald.jpgఇక జీర్ణ సంబంధిత సమస్యలను అస్సలు తేలికగా తీసుకోకూడదు. వీటిని నిర్లక్ష్యం చేశామంటే ఖచ్చితంగా మనం భవిష్యత్తుల్లో చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మనం ఎంతటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిన్నా కూడా ఆ ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే మన శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. అందుకే మనం జీర్ణాశయాన్ని, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.అసలు ఎలాంటి జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక మనHEALTH{#}salt;Mixie;Air;Manamజీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే..?జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే..?HEALTH{#}salt;Mixie;Air;ManamThu, 16 Feb 2023 14:54:14 GMTఇక జీర్ణ సంబంధిత సమస్యలను అస్సలు తేలికగా తీసుకోకూడదు. వీటిని నిర్లక్ష్యం చేశామంటే ఖచ్చితంగా మనం భవిష్యత్తుల్లో చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మనం ఎంతటి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిన్నా కూడా ఆ ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే మన శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. అందుకే మనం జీర్ణాశయాన్ని, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.అసలు ఎలాంటి జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల చాలా ఈజీగా మలబద్దకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధిత సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించే ఈచూర్ణాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను, వామును, సోంపు గింజలను అలాగే నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ఒక కళాయిలో రెండు టీ స్పూన్ల వామును ఇంకా అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకోవాలి.ఆ తరువాత వీటిని చిన్న మంటపై ఒక 2 నిమిషాల పాటు వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఈ జార్ లో రెండు టీ స్పూన్ల సోంపు గింజలు ఇంకా అలాగే తగినంత నల్ల ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఇక ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక గాజు సీసాలో వేసి గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. తరువాత ఈ నీటిని రాత్రి భోజనం చేసిన గంట తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల పొద్దున్నే కల్లా ప్రేగుల్లో పేరుకుపోయిన మలం అంతా తొలగిపోతుంది. ప్రేగులు బాగా శుభ్రపడతాయి. ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇంకా అజీర్తి సమస్య తలెత్తకుండా ఉంటుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఈవిధంగా మన ఇంట్లో ఉండే పదార్థాలతో చూర్ణాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>