Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravichandran-ashwin-interesting-comments-bfb52110-6a4a-4a2a-89b8-090343c02bc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ravichandran-ashwin-interesting-comments-bfb52110-6a4a-4a2a-89b8-090343c02bc4-415x250-IndiaHerald.jpgసాధారణంగా సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్లదే కీలక పాత్ర ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా బలిలోకి దిగిన వారు ఇక బౌలర్లు వేసే వైవిధ్యమైన బంతులను ఎదుర్కొని ఎంతలా క్రీజులో పాతుకుపోతే.. ఇక ఆ జట్టు అంత పటిష్టంగా ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆచీ తూచి ఆడుతూ ఎప్పుడైతే ఓపనర్లు ఎక్కువగా పరుగులు చేస్తారో ఇక అప్పుడే జట్టు మొత్తం లాభపడుతూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే టెస్ట్ ఫార్మాట్ లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఆ మ్యాచ్కి ఓపెనర్లుగా ఎవరు ఉCricket{#}murali;sunil;Australia;Yevaru;Cricketకోహ్లీ, రోహిత్ కాదు.. అతనే బెస్ట్ ఓపెనర్ : అశ్విన్కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే బెస్ట్ ఓపెనర్ : అశ్విన్Cricket{#}murali;sunil;Australia;Yevaru;CricketThu, 16 Feb 2023 14:00:00 GMTసాధారణంగా సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో ఓపెనర్లదే కీలక పాత్ర ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా బలిలోకి దిగిన వారు ఇక బౌలర్లు వేసే వైవిధ్యమైన బంతులను ఎదుర్కొని ఎంతలా క్రీజులో పాతుకుపోతే.. ఇక ఆ జట్టు అంత పటిష్టంగా ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది.  అంతేకాదు ఆచీ తూచి ఆడుతూ ఎప్పుడైతే ఓపనర్లు ఎక్కువగా పరుగులు చేస్తారో ఇక అప్పుడే జట్టు మొత్తం లాభపడుతూ ఉంటుంది అని చెప్పాలి.  అందుకే టెస్ట్ ఫార్మాట్ లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఆ మ్యాచ్కి ఓపెనర్లుగా ఎవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు.


 ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బలిలోకి దిగుతున్నారు. అయితే ఇక అన్ని మ్యాచ్ లలో ఇదే ఓపెనింగ్ జోడి కొనసాగుతుందా లేకపోతే రోహిత్ కు జోడిగా మరొక ఓపెనర్ని బరిలోకి దింపుతారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇక ఓపెనర్లకు సంబంధించిన చర్చ కొనసాగుతుండగా అశ్విన్ తన ఫేవరెట్ ఓపెనర్లు ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ మురళి విజయ్ ప్రతిభ పై  ప్రశంసలు కురిపించాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. టెస్ట్ క్రికెట్లో దిగ్గజాలు సునీల్ గవాస్కర్,  వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత బెస్ట్ ఓపెనర్ మురళి విజయ్ అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక అంతేకాకుండా ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న చటేశ్వర్ పూజార సైతం టెస్టు ఫార్మాట్ కు సరిపోయే ఓపెనర్ అంటూ ప్రశంసల కురిపించాడు. అయితే మురళి విజయ్ తో అటు చేటేశ్వర్ పూజారను పోల్చాడు. ఇద్దరికీ కూడా తగిన గుర్తింపు రాలేదు. ఇద్దరు కూడా కొత్త బంతిని ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటారు. టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత కఠినమైన పని అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>