Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/actor-karthi-latest-photoshoot-stills-set-2415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/actor-karthi-latest-photoshoot-stills-set-2415x250-IndiaHerald.jpgసర్కారు వారి పాట సినిమా తర్వాత పరశురాం వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే అతని కెరీర్ లో వెయిట్ చేయాల్సి వచ్చింది. నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ అనుకోగా అది కాస్త అటకెక్కింది. ఇక దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈమధ్యనే ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఫిక్స్ Karthi{#}sekhar;vegetable market;dil raju;naga;vijay deverakonda;dhanush;Kollywood;Tamil;Telugu;Cinemaకార్తీతో పరశురాం.. విజయ్ సినిమా ఏమైంది..?కార్తీతో పరశురాం.. విజయ్ సినిమా ఏమైంది..?Karthi{#}sekhar;vegetable market;dil raju;naga;vijay deverakonda;dhanush;Kollywood;Tamil;Telugu;CinemaThu, 16 Feb 2023 16:54:25 GMTసర్కారు వారి పాట సినిమా తర్వాత పరశురాం వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే అతని కెరీర్ లో వెయిట్ చేయాల్సి వచ్చింది. నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ అనుకోగా అది కాస్త అటకెక్కింది. ఇక దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈమధ్యనే ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఫిక్స్ అయినా పరశురాం కోలీవుడ్ హీరో కార్తీని కలిసి ఒక కథ వినిపించినట్టు తెలుస్తుంది. కార్తీ సినిమాలు తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధిస్తున్నాయి.

ఆయన కూడా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ఊపిరి సినిమా చేసిన కార్తీ మరో సినిమా కోసం చూస్తున్నాడు. తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలిగే కార్తీ తెలుగు లో డైరెక్ట్ సినిమా చేస్తే ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇక పరశురాం కథ చెప్పడం కార్తీ నచ్చడం జరిగిందట. ఫుల్ స్క్రిప్ట్ తీసుకుని వస్తే అప్పుడు కాంబో ఫిక్స్ చేద్దామని అన్నారట. దాదాపు పరశురాం కార్తీ సినిమా కన్ ఫర్మ్ అయినట్టే అని అంటున్నారు. కార్తీ కూడా డైరెక్ట్ తెలుగు సినిమాపై ఆసక్తి చూపించడంతో పరశురాం తను రాసుకున్న ఓ కథకు ఆయన పర్ఫెక్ట్ అని కార్తీని కలిశాడు.

మొత్తానికి మరో క్రేజీ కాంబో మూవీ రాబోతుంది. ఈమధ్య తమిళ హీరోలంతా కూడా తెలుగు లో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ ఆల్రెడీ సార్ తో వస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పుడు కార్తీ కూడా అదే రూట్ లో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ సినిమా తర్వాతే పరశురాం కార్తీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో కార్తీ తెలుగుతో మళ్లీ సూపర్ పాపులర్ అవ్వాలని చూస్తున్నాడు.






RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>