SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india-australia-2nd-test-2023f4d51599-9675-41c9-bb19-f9bea38a2266-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india-australia-2nd-test-2023f4d51599-9675-41c9-bb19-f9bea38a2266-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ రెండు జట్ల మధ్యన నాలుగు టెస్ట్ లు మరియు మూడు వన్ డే లు జరగనున్నాయి. కాగా స్వదేశంలో ఇండియాను టెస్ట్ లలో ఓడించడం అంత ఈజీ కాదన్న విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. అందుకు తగినట్లే నాగ్ పూర్ లో కేవలం మూడు రోజులలోనే ముగిసిన మొదటి టెస్ట్ లో ఇండియా ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది.INDIA-AUSTRALIA-2ND-TEST-2023{#}Arun;Arun Jaitley;Ravindra Jadeja;Australia;Delhi;Indiaఢిల్లీ టెస్ట్ లో ఇండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా భారీ ప్లాన్ !ఢిల్లీ టెస్ట్ లో ఇండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా భారీ ప్లాన్ !INDIA-AUSTRALIA-2ND-TEST-2023{#}Arun;Arun Jaitley;Ravindra Jadeja;Australia;Delhi;IndiaThu, 16 Feb 2023 19:25:43 GMTప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ రెండు జట్ల మధ్యన నాలుగు టెస్ట్ లు మరియు మూడు వన్ డే లు జరగనున్నాయి. కాగా స్వదేశంలో ఇండియాను టెస్ట్ లలో ఓడించడం అంత ఈజీ కాదన్న విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. అందుకు తగినట్లే నాగ్ పూర్ లో కేవలం మూడు రోజులలోనే ముగిసిన మొదటి టెస్ట్ లో ఇండియా ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది. ఈ టెస్ట్ లో ఇండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. ముఖ్యంగా జడేజా బంతి బ్యాట్ రెండింటితోనూ రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో మరో విజయంపై ఇండియా కన్నేసింది.

రేపు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది. సిరీస్ లో ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పాలి. అందుకే ఆస్ట్రేలియా టీం కోచ్ మరియు కెప్టెన్ లు ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలన్న కసితో వ్యూహాలతో నిమగ్నం అయ్యారు. గత మ్యాచ్ లో ఫెయిల్ అయినా ఆటగాళ్లపై వేటు పడేలా ఉంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ మాట్ రెన్సా రెండు ఇన్నింగ్స్ లలోనూ ఘోరంగా విఫలం అయ్యాడు. అందుకే ఇతనిని బెంచ్ కే పరిమితం చేసి హెడ్ ను జట్టులోకి తీసుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

ఇక స్టార్క్ , హాజిలీవూడ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే ఛాన్సెస్ ఉంది. ఇక ఈ మధ్యన ముగిసిన బిగ్ బాష్ లీగ్ లో అద్బుతమగా రాణించిన స్పిన్నర్ కూనేమాన్ కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియాను టెస్ట్ లలో ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా నిలపడంలో కీలకంగా మారిన స్టీవెన్ స్మిత్, మార్నష్ లబుచెన్ , వార్నర్ , ఖవాజా లు రాణిస్తే ఖచ్చితంగా ఈ టెస్ట్ ను మాత్రమే కాదు.. సిరీస్ ను కూడా గెలుచుకోవచ్చు. ఇక గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన స్పిన్నర్ టాడ్ మర్ఫీ మరోసారి రాణిస్తే గెలుపు ఈజీనే..మరి ఏమి జరుగుతుంది అన్నది చూడాలి.  



RRR Telugu Movie Review Rating

బాక్స్ ఆఫీస్ వద్ద ధనుష్ "సార్" మార్కులు కొడతాడా ?

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>