SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/women-s-world-cup-2023-india9d379185-5f2a-4add-821b-35f723705b10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/women-s-world-cup-2023-india9d379185-5f2a-4add-821b-35f723705b10-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10 వ తేదీ నుండి మహిళల టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను దక్కించుకోవడానికి మొత్తం పధి జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి తమ పోరాడుతున్నారు. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా , శ్రీలంక , సౌత్ ఆఫ్రికా , బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లు ఉండగా, గ్రూప్ బి లో ఇంగ్లాండ్ , ఇండియా , పాకిస్తాన్ , వెస్ట్ ఇండీస్ మరియు ఐర్లాండ్ లు తలపడుతున్నాయి. WOMEN'S-WORLD-CUP-2023-INDIA{#}Ireland;Saturday;Qualification;New Zealand;South Africa;Australia;Pakistan;England;World Cup;Sri Lanka;February;Indiaఇండియా ఇలాగే ఆడితే వరల్డ్ కప్ ఫైనల్ చేరడం కష్టమే !ఇండియా ఇలాగే ఆడితే వరల్డ్ కప్ ఫైనల్ చేరడం కష్టమే !WOMEN'S-WORLD-CUP-2023-INDIA{#}Ireland;Saturday;Qualification;New Zealand;South Africa;Australia;Pakistan;England;World Cup;Sri Lanka;February;IndiaThu, 16 Feb 2023 13:39:11 GMTప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10 వ తేదీ నుండి మహిళల టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను దక్కించుకోవడానికి మొత్తం పధి జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి తమ పోరాడుతున్నారు. గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా , శ్రీలంక , సౌత్ ఆఫ్రికా , బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లు ఉండగా, గ్రూప్ బి లో ఇంగ్లాండ్ , ఇండియా , పాకిస్తాన్ , వెస్ట్ ఇండీస్ మరియు ఐర్లాండ్ లు తలపడుతున్నాయి. రెండు గ్రూప్ ల నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఇక ఇండియా మహిళల జట్టుకు ఇంకా సరైన పోటీ తగల్లేదు అని చెప్పాలి. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ పై గెలుచుకోగా, రెండవ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ పై సునాయాస విజయాన్ని అందుకుంది.

ఇదే ఊపును కనుక సాగిస్తే గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు... కానీ సెమీస్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్ల నుండి పోటీ ఎదుర్కునే అవకాశం ఉంది. అందుకే జట్టులోని అందరూ సమిష్టిగా ఆడితేనే ఫైనల్ కు అర్హత  సాధిస్తారు. ఇండియా తర్వాత మ్యాచ్ శనివారం రోజున ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఇందులో కనుక విజయం సాధిస్తే ఆడిన మూడు మ్యాచ్ లలో మూడింటినీ గెలిచినందువలన సెమీస్ కు ఈజీగా అర్హత సాధిస్తుంది. ఒకవేళ సెమీస్ చేరుకుంటే ఇండియా ఆస్ట్రేలియా తో తలపడాల్సి వస్తుంది.

ఈ టోర్నీలో ట్రోఫీని గెలుచుకోగల సామర్ధ్యం ఉన్న జట్లలో ఆస్ట్రేలియా ప్రధమ స్థానంలో ఉంటుందని చెప్పగలము. ఆ తర్వాత ఇంగ్లాండ్ మరియు ఇండియా లను చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ కఠినమైన సవాలు ఎదుర్కోకపోవడంతో మన వీక్ నెస్ లు బయటపడలేదు. ఇక నిన్నటి మ్యాచ్ లో అయితే వెస్ట్ ఇండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి 19 వ ఓవర్ వరకు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇదే విధంగా ఆడితే ట్రోఫీని సాధించడం కాదు కదా , ఫైనల్ కు చేరడం కూడా గగనమే. మరి చూద్దాం ఏమి జరగనుందో ?



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>