Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna79991e15-723c-4d2f-9e6f-942620b50f9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna79991e15-723c-4d2f-9e6f-942620b50f9b-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలో ఉండే హీరో హీరోయిన్ల కారణంగానే సినిమా హిట్టు ఫ్లాపు జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ కథ కథనం బలంగా ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో హీరో హీరోయిన్లు, కథ కథనం ఎంత ముఖ్యమో ఇక సినిమాకు పెట్టే టైటిల్ కూడా అంతే ముఖ్యం. టైటిల్ బాగుంటేనే జనాల్లోకి ఆ సినిమా వెళ్తుంది. లేదంటే విచిత్రమైన టైటిల్స్ కొన్ని సినిమాకు మైనస్ గా మారిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సినిమా టైటిల్ కొత్తగా ఉండే విధంగా కొన్ని కొన్ని సార్లు ఇంగ్లీష్ టైటిల్స్ కూడా పెట్టడం లాNagarjuna{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;sudheer babu;vijay deverakonda;Variar;Kathanam;Audience;India;ram pothineni;bhavana;Hero;Cinemaటాలీవుడ్ లో మరో సెంటిమెంట్.. ఆ టైటిల్ పెడితే సినిమా ఫ్లాపే?టాలీవుడ్ లో మరో సెంటిమెంట్.. ఆ టైటిల్ పెడితే సినిమా ఫ్లాపే?Nagarjuna{#}Naga Chaitanya;Akkineni Nagarjuna;sudheer babu;vijay deverakonda;Variar;Kathanam;Audience;India;ram pothineni;bhavana;Hero;CinemaThu, 16 Feb 2023 10:15:00 GMTసాధారణంగా సినిమాలో ఉండే హీరో హీరోయిన్ల కారణంగానే సినిమా హిట్టు ఫ్లాపు జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ కథ కథనం బలంగా ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో హీరో హీరోయిన్లు, కథ కథనం ఎంత ముఖ్యమో ఇక సినిమాకు పెట్టే టైటిల్ కూడా అంతే ముఖ్యం. టైటిల్ బాగుంటేనే జనాల్లోకి ఆ సినిమా వెళ్తుంది. లేదంటే విచిత్రమైన టైటిల్స్ కొన్ని సినిమాకు మైనస్ గా మారిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.


 సినిమా టైటిల్ కొత్తగా ఉండే విధంగా కొన్ని కొన్ని సార్లు ఇంగ్లీష్ టైటిల్స్ కూడా పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇలా ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ కొట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్ ఉంది అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమనటం ఖాయం అనే భావన అందరిలో కలుగుతుంది. ఇలా ఇంగ్లీష్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అమిగోస్ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఈ సినిమాకు ముందు సుధీర్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హంట్ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.


 నాగార్జున హీరోగా నటించిన ది గోస్ట్ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. మరోవైపు చిన్న సినిమాగా వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా కూడా వచ్చి పోయిందన్న విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. రామ్ హీరోగా నటించిన ది వారియర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు సాధించలేకపోయింది. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇవి మాత్రమే కాకుండా టాప్ గేర్,సెవెన్ డేస్ 6 నైట్స్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ విషయం తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే ఫ్లాప్ అనే కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

బుట్ట బొమ్మకి ఆఫర్లు కరువాయే..!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>