MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-trivikram67964bd2-6897-4a33-b3a9-b0dc2251209e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-trivikram67964bd2-6897-4a33-b3a9-b0dc2251209e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే మహేష్ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ ఓ మాస్టర్ ప్లాన్NTR And Trivikram{#}Shiva;thaman s;lord siva;Agnyaathavaasi;Haarika & Hassine Creations;Rajani kanth;KGF;prashanth neel;Prasanth Neel;Master;trivikram srinivas;naga;NTR;vamsi;Music;kalyan;Tollywood;producer;Producer;India;sithara;Director;Cinemaఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాక్సఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ..?ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. బాక్సఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ..?NTR And Trivikram{#}Shiva;thaman s;lord siva;Agnyaathavaasi;Haarika & Hassine Creations;Rajani kanth;KGF;prashanth neel;Prasanth Neel;Master;trivikram srinivas;naga;NTR;vamsi;Music;kalyan;Tollywood;producer;Producer;India;sithara;Director;CinemaWed, 15 Feb 2023 16:35:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే మహేష్ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్మాస్టర్ ప్లాన్ వేసినట్లు తాజా సమాచారం. ఇక ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి వంటి ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.. 

ఆ సమయంలో త్రివిక్రమ్ కి ఒక భారీ హిట్ కావాలి. దాంతో తన కెరీర్ లోనే తొలిసారిగా ఎన్టీఆర్ తో చేతులు కలిపాడు. వీరి కాంబినేషన్లో 'అరవింద సమేత' సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మళ్ళీ త్రివిక్రమ్ తనను తాను నిరూపించుకున్నాడు. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. నిజానికి మహేష్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ అని వార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గురించి మాట్లాడుతూ..' ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో ఉంటుందని చెప్పారు.

అంతేకాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అని మేకర్స్ ముందే ప్రకటించారు. ఇది పూర్తయిన అనంతరం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది. అయితే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పౌరాణికం నేపథ్యంలో ఉంటుందని తాజాగా నాగ వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా ఈ ప్రాజెక్టు పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది...!!



RRR Telugu Movie Review Rating

SSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>