MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb2978ae6f32-b3e6-4cef-aff6-46eed2f4fd5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb2978ae6f32-b3e6-4cef-aff6-46eed2f4fd5f-415x250-IndiaHerald.jpgఆర్ ఆర్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరిచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు జక్కన్న. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ గురించి కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని ప్రకారం ఈ సినిమాలో మహేష్ గా జోడిగా ఆలియా భట్, ప్రియాSSMB29{#}priyanka;Rajamouli;Graphics;Sex;Hollywood;deepika;trivikram srinivas;mahesh babu;BEAUTY;Alia Bhatt;CBN;Rajani kanth;India;Heroine;bollywood;News;CinemaSSMB29: మహేష్ కోసం ఆ హీరోయిన్ ని ఫైనల్ చేసిన జక్కన్న..?SSMB29: మహేష్ కోసం ఆ హీరోయిన్ ని ఫైనల్ చేసిన జక్కన్న..?SSMB29{#}priyanka;Rajamouli;Graphics;Sex;Hollywood;deepika;trivikram srinivas;mahesh babu;BEAUTY;Alia Bhatt;CBN;Rajani kanth;India;Heroine;bollywood;News;CinemaMon, 13 Feb 2023 16:40:00 GMTఆర్ ఆర్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరిచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు జక్కన్న. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ గురించి కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని ప్రకారం ఈ సినిమాలో మహేష్ గా జోడిగా ఆలియా భట్, ప్రియాంక చోప్రా పేర్లు ఎక్కువగా వినిపించాయి. 

కానీ తాజా సమాచారం ఆ అవకాశాన్ని బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలోని రాజమౌళి దీపిక పదుకొనేతో చర్చలు జరిపారని వార్తలు వినిపించినా.. దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా రాజమౌళి దీపికా పదుకొనేని ఫైనల్ చేశాడని సమాచారం. దీపికా పదుకొనే ఇటీవ లటించిన 'పఠాన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఆ సినిమాలో దీపిక తన యాక్షన్ తో అదరగొట్టడంతో.. అది నచ్చి ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమాకి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు తో తెరకెక్కించేది అడ్వెంచర్స్ యాక్షన్ మూవీ. అందుకే దీపిక అయితే మహేష్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెని ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం పనిచేస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర భాషలకు చెందిన కాస్టింగ్ కూడా రాజమౌళి తీసుకుంటున్నారు. ఈసారి వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మహేష్ బాబు మూవీ ని రూపొందించాలని ప్లాన్లో ఉన్నాడు జక్కన్న. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ మొత్తాన్ని మార్చుకోబోతున్నారట. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఈ సినిమాని సెక్స్ పైకి తీసుకెళ్లాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. అప్పటివరకు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ని పూర్తి చేసి ఆలస్యం లేకుండా వెంటనే రాజమౌళితో సినిమాని పట్టాలెక్కించనున్నాడట. 2025 లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>