Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pelliaa8a8232-cfe1-4032-b2ad-a6be346bd33c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pelliaa8a8232-cfe1-4032-b2ad-a6be346bd33c-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే ఎందుకంటే పాతికేళ్ల ప్రాయంలో తొందరపడి పెళ్లి చేసుకుంటే ఇక మిగిలిన జీవితం మొత్తం బాధతోనే గడపాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ ఏడు అడుగులు నడుస్తూ ఉంటారు అని చెప్పాలి.. ఇక తమ అభిప్రాయాలను అర్థం చేసుకునే వారిని తమ ఇష్టాయిష్టాలను గౌరవించేవారిని పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు అయితే సినిమాల్లో హీరోలను చూసి అలాంటి రాకుమారుడు భర్తగా వస్తే చాలు అని కోరుకుPelli{#}marriageపరమశివుడిని పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడంటే?పరమశివుడిని పెళ్లి చేసుకున్న యువతి.. ఎక్కడంటే?Pelli{#}marriageMon, 13 Feb 2023 21:15:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే   ఎందుకంటే పాతికేళ్ల ప్రాయంలో తొందరపడి పెళ్లి చేసుకుంటే ఇక మిగిలిన జీవితం మొత్తం బాధతోనే గడపాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగు వేస్తూ ఏడు అడుగులు నడుస్తూ ఉంటారు అని చెప్పాలి.. ఇక తమ అభిప్రాయాలను అర్థం చేసుకునే వారిని తమ ఇష్టాయిష్టాలను గౌరవించేవారిని పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు అయితే సినిమాల్లో హీరోలను చూసి అలాంటి రాకుమారుడు భర్తగా వస్తే చాలు అని కోరుకుంటూ అంటారు.



 ఈ క్రమంలోనే కలల రాకుమారుడు కోసం ఎన్నో పగటి కలలు కూడా కంటూ ఉంటారు అని చెప్పాలి. చివరికి పెద్దలు చూసిన వారిని పెళ్లి చేసుకొని వారితో  దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది అమ్మాయిలు ఇలా అందమైన యువకుడి కోసం వెతకడం.. తమకు నచ్చిన వాడు దొరికేంతవరకు కూడా ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సల్ చేసుకోవడం లాంటి విన్నాము. అయితే ఇక్కడ ఓ యువతి మాత్రం ఏకంగా దేవుడిని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.


 ఇప్పటికే ఎంతోమంది ఏకంగా తమను తామే పెళ్లి చేసుకుని షాక్ ఇస్తుంటే.. ఇక్కడ ఒక యువతీ ఏకంగా లార్డ్ శివుడిని పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది   ఎంబీఏ చదివిన నికిత కుటుంబీకుల అంగీకారంతో బ్రహ్మకుమారి ఆశ్రమంలో వివాహ ఆచారం ప్రకారమే కళ్యాణ తోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాలవేసి ఏకంగా పరమశివుడినే భర్తగా అంగీకరించింది. ప్రపంచంలో ప్రతి మనిషి విచారంగా ఉంటాడు. అందుకే నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అంటూ చెబుతుంది నికిత. ఏది ఏమైనా సదరు యువతి ఇలా ఏకంగా పరమశివుడిని పెళ్లి చేసుకుని.. భర్తగా అంగీకరించడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>