MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitaramam-directors-next-project-fix65c89ab6-e864-475f-acaf-d45bcf654912-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitaramam-directors-next-project-fix65c89ab6-e864-475f-acaf-d45bcf654912-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గత ఏడాది విడుదలైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది 'సీతారామం'. థియేటర్లో రిపీట్ ఆడియన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సాధించింది. మలయాళ అగ్ర హీరో దుల్కర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ ఆడియన్స్ సైతం ఈ సినిమా ఆకట్టుకోవడం విశేషం. అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలHanu Raghavapudi{#}Nani;surya sivakumar;Kollywood;Darsakudu;twitter;Ram Charan Teja;Hanu Raghavapudi;prema;Blockbuster hit;Audience;Hero;News;Hindi;Love;Cinema;Director'సీతారామం' డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?'సీతారామం' డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?Hanu Raghavapudi{#}Nani;surya sivakumar;Kollywood;Darsakudu;twitter;Ram Charan Teja;Hanu Raghavapudi;prema;Blockbuster hit;Audience;Hero;News;Hindi;Love;Cinema;DirectorMon, 13 Feb 2023 20:34:14 GMTటాలీవుడ్ లో గత ఏడాది విడుదలైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది 'సీతారామం'. థియేటర్లో రిపీట్ ఆడియన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సాధించింది. మలయాళ అగ్ర హీరో దుల్కర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ ఆడియన్స్ సైతం ఈ సినిమా ఆకట్టుకోవడం విశేషం. అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాలో తన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో మ్యాజిక్ చేశాడు ఈ డైరెక్టర్. 

దీంతో ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ ఎవరితో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు హను రాఘవపూడి తన తదుపరి చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నానితో చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కానీ తాజాగా తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చగానే చాలామందికి ఒక హింట్ ఇచ్చినట్లయింది.గతంలో నానితో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' అనే సినిమాని తెరకెక్కించాడు హను రాఘవపూడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నాచురల్ స్టార్ నానితో తన తదుపరి సినిమాను చేస్తున్నాడు. ఇక మరోవైపు ఈ మధ్యన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఓ కథను వినిపించాడట. ఆ కథ సూర్యకు బాగా నచ్చిందట. 

కానీ ఆ కథలో మరో స్టార్ హీరో క్యారెక్టర్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సినిమాలోని ఆ స్పెషల్ రోల్ కోసం రామ్ చరణ్ అయితే బాగుంటుందని సూర్య అన్నారట. ఈ మేరకు రామ్ చరణ్ ఒకసారి కలవాల్సిందిగా దర్శకుడు హనురాఘవపూడి కి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హను రాఘవపూడి తో రామ్ చరణ్ ఇప్పటికే ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ దర్శకుడు సూర్యకు చెప్పిన కథ ప్రకారం అందులో గెస్ట్ రోల్ చేసేందుకు చరణ్ అంగీకరిస్తే కచ్చితంగా సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ఉండబోతుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. మొత్తం మీద సీతారామం హిట్ తో హను రాఘవపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం స్టార్ హీరోలను లైన్లో పెట్టడం గమనార్హం...!!
" style="height: 370px;">




RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>