PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-akkineni-nagarjuna-0232a170-4e04-4b39-8225-01de82fc1819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balayya-tdp-akkineni-nagarjuna-0232a170-4e04-4b39-8225-01de82fc1819-415x250-IndiaHerald.jpgతర్వాత అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ కొంచెం గట్టిగానే రియాక్టయ్యారు. అయితే ఎస్వీ రాంగారావును అవమానించారంటు కాపుసంఘాలు గట్టిగానే రియాక్టయ్యాయి. ఎస్వీ రంగారావుకు క్షమాపణలు చెప్పకపోతే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామంటు వార్నింగ్ కూడా ఇచ్చాయి. దీనిమీ నాలుగురోజులు కాంట్రవర్సీ నడిచిన తర్వాత తీరిగ్గా బాలయ్య రియాక్టయ్యారు. అయితే మళ్ళీ నోటిదురుసును ప్రదర్శించటంతో కొత్త వివాదం మొదలైంది. balayya tdp Akkineni nagarjuna {#}naga;Nara Lokesh;prema;SV museum;Love;Father;akhil akkineni;Balakrishnaఅమరావతి : కావాలనే బాలయ్య కెలుక్కుంటున్నారా ?అమరావతి : కావాలనే బాలయ్య కెలుక్కుంటున్నారా ?balayya tdp Akkineni nagarjuna {#}naga;Nara Lokesh;prema;SV museum;Love;Father;akhil akkineni;BalakrishnaFri, 27 Jan 2023 03:00:00 GMT




అక్కినేని కుటుంబాన్ని కావాలనే నందమూరి బాలకృష్ణ కెలుక్కుంటున్నట్లున్నారు. తాము తప్ప మిగిలిన వాళ్ళంతా ఎందుకు పనికిరానివారని బాలయ్య ఆలోచన. అందుకనే సందర్భం ఏదైనా ‘తమ బ్లడ్డు వేరు తమ బ్రీడు వేరు’ అంట పదేపదే ఎదుటివాళ్ళని చాలా చులకనగా మాట్లాడటం బాలయ్యకు అలవాటైపోయింది. తాజాగా అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఈమధ్యనే ఓ ఫంక్షన్లో ఆ రంగారావు ఈ రంగారావు..అక్కినేని తొక్కినేని అంటు నోటికొచ్చింది మాట్లాడేశారు.





తర్వాత అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ కొంచెం గట్టిగానే రియాక్టయ్యారు. అయితే ఎస్వీ రాంగారావును అవమానించారంటు కాపుసంఘాలు గట్టిగానే రియాక్టయ్యాయి. ఎస్వీ రంగారావుకు క్షమాపణలు చెప్పకపోతే నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామంటు వార్నింగ్ కూడా ఇచ్చాయి. దీనిమీ నాలుగురోజులు కాంట్రవర్సీ నడిచిన తర్వాత తీరిగ్గా బాలయ్య రియాక్టయ్యారు. అయితే మళ్ళీ నోటిదురుసును ప్రదర్శించటంతో కొత్త వివాదం మొదలైంది.





ఇంతకీ బాలకృష్ణ ఏమన్నారంటే అక్కేని నాగేశ్వరరావును తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ అవమానించలేదన్నారు. అక్కినేని అంటే తనకు చాలా గౌరవం, ప్రేమ అని చెప్పారు. ఇంతవరకు చెప్పి ఊరుకుంటే తన బాలయ్య ఎందుకవుతారు ? తర్వాత దాన్ని కంటిన్యు చేస్తు అక్కినేని తనకు బాబాయ్ లాంటి వాళ్ళన్నారు. తనతో అక్కినేని చాలా ప్రేమగా ఉంటారని చెప్పారు. తన కుటుంబసభ్యుల దగ్గర ఆప్యాయత, ప్రేమ దొరకదు కాబట్టే తనతో ప్రేమగా ఉంటారని చెప్పారు.





తన కుటుంబసభ్యులు అక్కినేనితో ప్రేమగా ఉండకపోవటం ఏమిటి ? కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతమంది ఉన్నా ఒక్కళ్ళు కూడా నాగేశ్వరరావుతో ప్రేమగా లేరా అనే చర్చ మొదలైంది. ఇంతమంది దగ్గర దొరకని ప్రేమ నాగేశ్వరరావుకు బాలయ్య దగ్గర ఏమి దొరికింది ? నిజంగానే నాగేశ్వరరావుతో అంత ప్రేమగా ఉండే బాలయ్య మరి తన తండ్రి ఎన్టీయార్ తో మాత్రం ఎందుకు లేరనే ప్రశ్నలు నెటిజన్లు సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. మొత్తానికి ఏదో చెప్పబోయే ఇంకేదో చెప్పారా లేకపోతే కావాలనే అక్కినేని వారుసులతో కెలుక్కుంటున్నారా అన్నదే అర్ధం కావటంలేదు.





RRR Telugu Movie Review Rating

విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

సుప్రీంకోర్ట్ వర్సెస్‌ మోదీ సర్కార్‌.. ఎవరిది పైచేయి?

వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>