HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/vasmu-usesd7251929-8970-4084-8695-4991149b9425-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/vasmu-usesd7251929-8970-4084-8695-4991149b9425-415x250-IndiaHerald.jpgసాధారణంగా వంటింట్లో లభించే ప్రతి ఔషధం కూడా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇకపోతే జీలకర్రను మొదలుకొని వాము వరకు ప్రతి ఒక్కటి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చాలామంది వీటిని కేవలం వంటలకు రుచి తీసుకురావడానికి మాత్రమే వేస్తారు అని అంటారు. కానీ వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇకపోతే వంటింట్లో తరచూ ఉపయోగించే వాము వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం. వాము కండరాల్లో ఏర్పడే నొప్పులను తగ్గిస్తాయి. మహిళల్లో ఋతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లVASMU;USES{#}Butterఈ దినుసుతో తలనొప్పిని మొదలు అన్ని నొప్పులు కూడా పరార్..!ఈ దినుసుతో తలనొప్పిని మొదలు అన్ని నొప్పులు కూడా పరార్..!VASMU;USES{#}ButterFri, 27 Jan 2023 06:00:00 GMTసాధారణంగా వంటింట్లో లభించే ప్రతి ఔషధం కూడా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇకపోతే జీలకర్రను మొదలుకొని వాము వరకు ప్రతి ఒక్కటి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చాలామంది వీటిని కేవలం వంటలకు రుచి తీసుకురావడానికి మాత్రమే వేస్తారు అని అంటారు. కానీ వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.  ఇకపోతే వంటింట్లో తరచూ ఉపయోగించే వాము వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం.

వాము కండరాల్లో ఏర్పడే నొప్పులను తగ్గిస్తాయి. మహిళల్లో ఋతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే కడుపులో ఏర్పడే నొప్పులు, అపాయవాయువు, గ్యాస్ తో కూడిన  త్రేనుపులు వంటి సమస్యల్ని వాము నివారిస్తుంది. అంతేకాకుండా  మైగ్రేన్ తలనొప్పి శరీరంలో పేరుకుపోయిన  మలినాలను బయటకు పంపడం, శరీరంలో రక్తప్రసరణ మెరుగుపర్చడం, జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వాము వలన కలుగుతాయి.

వాము మగవారికి ఎంతో మేలును చేస్తుంది. వాము, చింత గింజల పొడి మరియు వెన్న ఈ మూడింటిని ఒక స్పూన్ పరిమాణంలో తీసుకొని తర్వాత తేనె కలిపిన పాలు తీసుకోవడం వలన అకాల స్కలనం తగ్గడంతో పాటు, వీర్యకణాల సంఖ్య పెరుగుట,మరియు పురుషులలో లైంగిక పటుత్వం కలుగుతాయి.. ఫలితంగా సంతానోత్పత్తిని కూడా పెంచుతుంది. ఇకపోతే వాము మనకు కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రధమంగా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది . ముఖ్యంగా వామును రెండు రోజులకు ఒకసారి నోట్లో వేసుకొని నమలడం వల్ల నోట్లో ఉన్న క్రిములు నశించడమే కాదు.. దుర్వాసన కూడా దూరం అవుతుంది..పైగా చిగుళ్ల వాపు , దంతాల నుంచి రక్తస్రావం వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.వాము వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుకె.. వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉంటారు.



RRR Telugu Movie Review Rating

విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

సుప్రీంకోర్ట్ వర్సెస్‌ మోదీ సర్కార్‌.. ఎవరిది పైచేయి?

వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>