EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tspscd4b27837-4354-47fa-9345-6617917361aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tspscd4b27837-4354-47fa-9345-6617917361aa-415x250-IndiaHerald.jpgహైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులు కోరుతున్నారు. 2017 గురుకుల పీఈటీ ఫలితాలు ఇవ్వాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేస్తున్నారు. 2017 గురుకుల పీఈటీ అభ్యర్థుల సంఘం హైదరాబాద్ లో తాజాగా ఆందోళనలకు దిగింది. వివిధ జిల్లాల నుంచి పిల్లలతో సహా తరలి వచ్చిన అభ్యర్థులు... నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు రోడ్డుపై బైఠాయించి కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటింTSPSC{#}pragathi;Telangana;Diploma;advertisement;Hyderabad;Telangana Chief Ministerనోటిఫికేషన్‌ ఇచ్చి ఆరేళ్లు.. ఇంకెప్పుడు ఉద్యోగాలు?నోటిఫికేషన్‌ ఇచ్చి ఆరేళ్లు.. ఇంకెప్పుడు ఉద్యోగాలు?TSPSC{#}pragathi;Telangana;Diploma;advertisement;Hyderabad;Telangana Chief MinisterThu, 26 Jan 2023 05:00:00 GMTహైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని
2017 గురుకుల పీఈటీ అభ్యర్థులు కోరుతున్నారు. 2017 గురుకుల పీఈటీ ఫలితాలు ఇవ్వాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేస్తున్నారు. 2017 గురుకుల పీఈటీ అభ్యర్థుల సంఘం హైదరాబాద్ లో తాజాగా ఆందోళనలకు దిగింది. వివిధ జిల్లాల నుంచి పిల్లలతో సహా తరలి వచ్చిన అభ్యర్థులు... నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు రోడ్డుపై బైఠాయించి కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


టీఎస్‌పీఎస్సీ కమిషన్ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని 2017 గురుకుల పీఈటీ సంఘం అధ్యక్షుడు సదానంద్ గౌడ్ మండిపడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ... ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెల్లడించక పోవడంతో మనస్తాపానికి గురై... ఎనిమిది పీఈటీఅభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని 2017 గురుకుల పీఈటీ ఆందోళన వ్యక్తం చేశారు.


ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని 2017 గురుకుల పీఈటీ మండిపడ్డారు. గత ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని 2017 గురుకుల పీఈటీ ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. 2017 సెప్టెంబర్‌లో గురుకుల పోస్టుల పీఈటీ పరీక్షలు రాసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. గురుకుల పీఈటీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారికి మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారందరికీ అవకాశం కల్పించి ఒకే పరీక్ష నిర్వహించారు.


మొత్తం 616 పోస్టులకుగానూ 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారు. అభ్యర్థులకు రోజురోజుకూ కుటుంబ పోషణ భారం అవుతోందని... ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులు కోరుతున్నారు. లేకపోతే అభ్యర్థులతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>