PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-ycp-tdp-vs-bjpb0c06b8c-63ea-4261-932b-ca753a5eedac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-ycp-tdp-vs-bjpb0c06b8c-63ea-4261-932b-ca753a5eedac-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా 2024 లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎలా గెలుపును సాధించాలి అన్న విషయంపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఎవరికి తోచిన వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెలుతున్నారు. వచ్చే ఎన్నికలతో వైసీపీ మూడవ సారి ఒంటరిగానే పోటీ చేయనుంది, అయితే రాష్ట్రంలో ఉన్న మరో మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ మరియు జనసేనలలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెలుతాయన్న విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.ap-ycp-tdp vs bjp{#}kalyan;Somu Veerraju;Janasena;YCP;politics;Elections;Party;Assembly;Andhra Pradesh;Bharatiya Janata Party;News2024 లో టీడీపీతో కలిసేది లేదట.. బీజేపీ అధ్యక్షుడు క్లారిటీ !2024 లో టీడీపీతో కలిసేది లేదట.. బీజేపీ అధ్యక్షుడు క్లారిటీ !ap-ycp-tdp vs bjp{#}kalyan;Somu Veerraju;Janasena;YCP;politics;Elections;Party;Assembly;Andhra Pradesh;Bharatiya Janata Party;NewsThu, 26 Jan 2023 16:49:33 GMTఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా 2024 లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎలా గెలుపును సాధించాలి అన్న విషయంపై దృష్టి పెట్టాయి. అందులో భాగంగా ఎవరికి తోచిన వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెలుతున్నారు. వచ్చే ఎన్నికలతో వైసీపీ మూడవ సారి ఒంటరిగానే పోటీ చేయనుంది, అయితే రాష్ట్రంలో ఉన్న మరో మూడు ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ మరియు జనసేనలలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెలుతాయన్న విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు టీటీడీపీ మరియు బీజేపీ లు రెండింటితోనూ సన్నిహత్యాన్ని కొనసాగిస్తున్న జనసేన పార్టీనేత పవన్ కళ్యాణ్.

ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడుతూ అటు ఆ రెండు పార్టీ నాయకులు కార్యకర్తలకు మరియు జనసేనను నమ్ముతున్న ప్రజలకు కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాడు. ఒకసారి టీడీపీతో కలిసి పోటీ చేస్తాను అంటాడు... మరోసారి పొత్తుల గురించి ఇప్పుడు ఆలోచించే అంత అవసరం ఏముంది, ఎన్నికలకు ముందు మా నిర్ణయాన్ని ప్రజలకు తెలియచేస్తామంటూ చెబుతాడు. దీనితో జనసేన కార్యకర్తలు కావొచ్చు లేదా తనను అభిమానిస్తున్న ప్రజలు కావొచ్చు డైలమాలో పడుతున్నారు. అస్సలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు అర్ధమవుతున్నాయా లేదా? ఎందుకు తీసుకున్న నిర్ణయం మీద నిలబడడం లేదు అంటూ విమర్శిస్తున్నారు.

తాజాగా ఈ పొత్తులపైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఏపీలో ఉన్న అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా అవినీతి కుటుంబ పార్టీలని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలను అధికారంలోకి రానివ్వమని.. జనసేన బీజేపీ లు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇక పవన్ ఎందుకు టీడీపీతో పొత్తు అంటున్నాడని అడుగగా... దీనికి మాత్రం సోము వీర్రాజు పవన్ నే ఈ విషయం అడిగి తెలుసుకోండంతో దాటవేశారు. మరి ఇన్ని సందేహాల నడుమ 2024 ఎన్నికలు ఎలా జరగనున్నాయి చూడాలి.  

 



RRR Telugu Movie Review Rating

విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

సుప్రీంకోర్ట్ వర్సెస్‌ మోదీ సర్కార్‌.. ఎవరిది పైచేయి?

వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>