PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/adhala-prabhakar-reddy038a69d3-35a3-43e4-bd7d-5baa2e0329e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/adhala-prabhakar-reddy038a69d3-35a3-43e4-bd7d-5baa2e0329e7-415x250-IndiaHerald.jpgసరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి.. రాత్రికి రాత్రే తన రాజకీయ అనుభవంతో పార్టీని మార్చేసి వైసీపీలో చేరాడు. మాములుగా అయితే ఆ ఎన్నికలో టీడీపీలో కొనసాగి ఉంటే నెల్లూరు రూరల్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయాల్సి వచ్చేది. కానీ ఉన్నపళంగా వైసీపీలోకి జంప్ అయ్యి ఏకంగా నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కొట్టేసాడు.adhala-prabhakar reddy{#}prabhakar;RAMIREDDY PRATAP KUMAR REDDY;Kanna Lakshminarayana;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Jagan;Adala Prabhakara Reddy;Hanu Raghavapudi;Nellore;MLA;News;YCP;House;MPకావలి ఎమ్మెల్యే సీటు డిమాండ్ చేస్తున్న నెల్లూరు ఎంపీ ?కావలి ఎమ్మెల్యే సీటు డిమాండ్ చేస్తున్న నెల్లూరు ఎంపీ ?adhala-prabhakar reddy{#}prabhakar;RAMIREDDY PRATAP KUMAR REDDY;Kanna Lakshminarayana;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Jagan;Adala Prabhakara Reddy;Hanu Raghavapudi;Nellore;MLA;News;YCP;House;MPWed, 25 Jan 2023 17:56:17 GMTసరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి.. రాత్రికి రాత్రే తన రాజకీయ అనుభవంతో పార్టీని మార్చేసి వైసీపీలో చేరాడు. మాములుగా అయితే ఆ ఎన్నికలో టీడీపీలో కొనసాగి ఉంటే నెల్లూరు రూరల్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయాల్సి వచ్చేది. కానీ ఉన్నపళంగా వైసీపీలోకి జంప్ అయ్యి ఏకంగా నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కొట్టేసాడు. దానితో వైసీపీ ఫ్యాన్ గాలిలో నెల్లూరు ఎంపీ స్థానం కూడా వశం అయింది. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే 2024 లో వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయాలన్న విషయంపై నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అదే విధంగా మన నెల్లూరు ఎంపీ ఆదాల కూడా వచ్చే ఎన్నికలలో ఎంపీ గా పోటీ చేయబోయేది లేదని క్లియర్ గా తెలుస్తోంది. అంతే కాకుండా నెల్లూరు నియోజకవర్గం నుండి కాకుండా కావలి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయాలని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన కొందరు షాక్ అవుతున్నారు. అదేంటి... ఎమ్మెల్యే పదవి కన్నా కూడా ఎంపీ పదవికి విలువ ఎక్కువగా ఉంటుంది.. అయినా ఎందుకో ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే పదవి కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆదాల కావలిలో గెస్ట్ హౌస్ ను కూడా నిర్మిస్తున్నాడట. అయితే ఎంత గట్టిగా ఫిక్స్ అయితే ముందుగానే తన ఏర్పాట్లలో ఉంటాడు అని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం కావలి ఎమ్మెల్యే గా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా వైసీపీ తరపున గెలుస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆదాల కోసం జగన్ కావలి నియోజకవర్గానికి ప్రతాపరెడ్డిని దూరం పెడతాడా అంటే సందేహమే. ఎందుకంటే అనుభవం పాపులారిటీ కన్నా ప్రజల గుండెల్లో ఉండే నాయకుడినే జగన్ ఎన్నుకుంటాడు. అలా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డికి కావలి ఎమ్మెల్యే సీటు దక్కడం చాలా కష్టం. మరి చూద్దాం ఏమి జరగనుందో ?  

 



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>