Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi3592fcc8-679e-42c0-b2d4-4c644b556100-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi3592fcc8-679e-42c0-b2d4-4c644b556100-415x250-IndiaHerald.jpgబలమైన సినీ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అందరిలా కమర్షియల్ హంగులు ఉన్న సినిమాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ ఇక అభిమానులను సంపాదించుకుంటూ పోతుంది. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రమే చేస్తాను అని కూర్చోకుండా విలన్ గా కూడా చేస్తూ ఇక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలకు ఆమె ఒక కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా పవర్ ఫుల్ స్టార్ హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలో నటిస్తూ తనVaralakshmi{#}Balakrishna;ramya krishnan;sharath;varalaxmi sarathkumar;Telugu;Kannada;Hero;Sharrath Marar;Cinemaరేటు పెంచిన వరలక్ష్మి.. ఇక నిర్మాతలకు చుక్కలే?రేటు పెంచిన వరలక్ష్మి.. ఇక నిర్మాతలకు చుక్కలే?Varalakshmi{#}Balakrishna;ramya krishnan;sharath;varalaxmi sarathkumar;Telugu;Kannada;Hero;Sharrath Marar;CinemaWed, 25 Jan 2023 08:40:00 GMTబలమైన సినీ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. అందరిలా కమర్షియల్ హంగులు ఉన్న సినిమాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేస్తూ ఇక అభిమానులను సంపాదించుకుంటూ పోతుంది. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు వస్తే మాత్రమే చేస్తాను అని కూర్చోకుండా విలన్ గా కూడా చేస్తూ ఇక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలకు ఆమె ఒక కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఏకంగా పవర్ ఫుల్ స్టార్ హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలో నటిస్తూ తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తూ ఉంది. ఇలా ఇటీవల కాలంలో ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ వర్సటైల్ యాక్టింగ్ కి చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు నీలాంబరి పాత్రతో రమ్యకృష్ణ ఎలా అయితే పాపులర్ అయిందో ఇక ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ సైతం లేడీ విలన్ నెగెటివ్ క్యారెక్టర్లు చేసి అదే రీతిలో పాపులారిటీ సంపాదించింది. తెలుగు తమిళం కన్నడం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో హవా నడిపిస్తుంది వరలక్ష్మి.


 ఇప్పుడు తన నటనతో ఎంతలా ప్రభావితం చేసిందంటే సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్న దర్శకనిర్మాతలు ఆమె కోసమే ప్రత్యేకంగా ఒక పాత్ర రాసే విధంగా అందరిని ప్రభావితం చేసింది. ఇకపోతే ఇలా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న వరలక్ష్మి ఇక ప్రస్తుతం తన క్రేజ్ ని క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో పడిందట. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా వీరసింహారెడ్డిలో నటించిన తర్వాత తను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం ఒక్కో సినిమాకి కోటికి పైగా డిమాండ్ చేస్తుందట. ఇక పెద్ద సినిమా అయితే కోటిన్నర వరకు పారితోషకం అడుగుతుండగా వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మీ పెంచిన రేటు తో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి అన్న టాక్ వినిపిస్తుంది.



RRR Telugu Movie Review Rating

మాస్ లుక్ లో అదరగోడుతున్న విక్టరీ వెంకటేష్....!!

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>