MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యూయల్ , మేఘ ఆకాష్ , పూజిత పొన్నోడా , పరీయ అబ్దుల్లా , దాక్షా నాగర్కర్ ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అందులో భాగంగా ఈ మూవీ షూటింraviteja{#}Ram Gopal Varma;megha akash;pujitha;sushanth;Josh;Telugu;ravi teja;Ravi;Posters;Box office;Director;Chiranjeevi;Cinemaరవితేజ "రావణాసుర" గ్లిమ్స్ విడుదల సమయాన్ని ప్రకటించిన చిత్ర బృందం..!రవితేజ "రావణాసుర" గ్లిమ్స్ విడుదల సమయాన్ని ప్రకటించిన చిత్ర బృందం..!raviteja{#}Ram Gopal Varma;megha akash;pujitha;sushanth;Josh;Telugu;ravi teja;Ravi;Posters;Box office;Director;Chiranjeevi;CinemaWed, 25 Jan 2023 20:01:53 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో అను ఇమ్మాన్యూయల్ , మేఘ ఆకాష్ , పూజిత పొన్నోడా , పరీయ అబ్దుల్లా , దాక్షా నాగర్కర్ ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ఇంకో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ రెండు పాటల షూటింగ్ ను కూడా చిత్ర బృందం పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి గ్లిమ్స్ విడుదల తేదిని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ మూవీ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

మరి ఈ మూవీ గ్లిమ్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం చివరలో విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ "రావణాసుర" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>