PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrbd9d89d0-79c9-487d-87b8-3265da2cba1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrbd9d89d0-79c9-487d-87b8-3265da2cba1c-415x250-IndiaHerald.jpgకేసీయార్ జాతీయ రాజకీయాల భవిష్యత్తంతా వచ్చేఎన్నికల ఫలితాల మీదే ఆధారపడుంది. సరే ఇక ప్రస్తుతానికి వస్తే కేసీయార్ కు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిలిచారు. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీయార్ గళమిప్పుతున్నారు కాబట్టే వీళ్ళంతా మద్దతుగా నిలబడ్డారు. మరి ప్రధానమంత్రి అభ్యర్ధిగా కేసీయార్ ను ప్రతిపాదించమంటే కూడా మద్దతిస్తారా ? brs kcr telangana{#}KCR;Allu Aravind;Kerala;Delhi;Congress;CM;Prime Minister;Khammam;Punjab;Chakramహైదరాబాద్ : కేసీయార్ ముందంతా సమస్యలేనా ?హైదరాబాద్ : కేసీయార్ ముందంతా సమస్యలేనా ?brs kcr telangana{#}KCR;Allu Aravind;Kerala;Delhi;Congress;CM;Prime Minister;Khammam;Punjab;ChakramTue, 24 Jan 2023 09:00:00 GMT


: 


ఒక్కసారిగా జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పేయాలన్నది కేసీయార్ బలమైన కోరిక. ఇందుకు పరిస్ధితులు ఎంతవరకు సహకరిస్తాయో కేసీయార్ తో పాటు ఎవరికీ తెలీదు. కాకపోతే తన గురించి తాను చాలా ఎక్కువగా కేసీయార్ అంచనాలు వేసుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. తెలంగాణా వరకు కేసీయార్ ఏమి చెప్పినా, ఏమిచేసినా చెల్లుబాటవుతోంది. కానీ వచ్చేఎన్నికల తర్వాత కూడా ఇదే పద్దతిలో కేసీయార్ మాట చెల్లుబాటవుతుందో లేదో తెలీదు.





కేసీయార్ జాతీయ రాజకీయాల భవిష్యత్తంతా వచ్చేఎన్నికల ఫలితాల మీదే ఆధారపడుంది. సరే ఇక ప్రస్తుతానికి వస్తే కేసీయార్ కు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిలిచారు. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీయార్ గళమిప్పుతున్నారు కాబట్టే వీళ్ళంతా మద్దతుగా నిలబడ్డారు. మరి ప్రధానమంత్రి అభ్యర్ధిగా కేసీయార్ ను ప్రతిపాదించమంటే కూడా మద్దతిస్తారా ?





ఇపుడు కేసీయార్ బలమెంత ? 17 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ బలం 9 సీట్లు. మిగిలిన కేజ్రీవాల్, విజయన్, మాన్, అఖిలేష్ బలమెంత ? దాదాపు నిల్లనే సమాధానం చెప్పాలి. పార్లమెంటులో 9 ఎంపీల బలమున్న కేసీయార్ 329 సీట్లున్న బీజేపీని ఏ విధంగా ఎదిరించగలరు ? లాజిక్కుకు ఎక్కడా సమాధానం దొరకటంలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సహకారం లేకుండా అసలు సాధ్యంకాదు.






ఎన్డీయేని ఎదిరించాలంటే యూపీఏ వల్లే సాధ్యం కావటంలేదు. అలాంటిది నాన్ యూపీఏ పార్టీలను ఏకతాటిపైకి తేవటం కేసీయార్ వల్లవుతుందా ? ఎన్డీయేకి వ్యతిరేకంగా యూపీఏ, నాన్ యూపీఏ పార్టీలు పోటీపడితే లాభపడేది మళ్ళీ ఎన్డీయేనే కదా. ఎన్డీయే అంటే మళ్ళీ బీజేపీనే కదా. ఎందుకంటే పేరుకే ఎన్డీయే కానీ అందులో బీజేపీని తీసేస్తే భాగస్వామ్య పార్టీల బలం నామమాత్రమే. పైగా కేసీయార్  స్ధిరత్వంలేని నేత కాబట్టే జాతీయ రాజకీయాల్లో ఏమాత్రం క్రెడిబులిటి లేదు. అందుకనే చాలామంది నేతలు కేసీయార్ కు దూరంగా ఉంటున్నారు. మరి ఇపుడున్న వాళ్ళని పెట్టుకుని కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.




RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>