SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-nz6af116d5-7a4e-41ce-a140-91d4aa9843b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-nz6af116d5-7a4e-41ce-a140-91d4aa9843b7-415x250-IndiaHerald.jpgఇక ఇండియా టూర్ కి వచ్చిన న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం నాడు (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో ఇండియా ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.ఇక ఈ భారీ విజయంతో ఇండియా 3-0తో సిరీస్‌ని కూడా కైవసం చేసుకోవడమే కాక 2023 వన్డేల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. మూడో మ్యాచ్‌లో భాగంగా మొదట టాస్ గెలిచిన కివీస్ టీమ్ ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభIND VS NZ{#}Anu Malik;Audi;Kuldeep Yadav;Hardik Pandya;Tom Banton;Tom Hooper;New Zealand;Varsham;Rohit Sharma;VIRAT KOHLI;tuesday;IndiaIND vs NZ 3rd ODI: న్యూజిలాండ్‌పై టీమిండియా సూపర్ విక్టరీ!IND vs NZ 3rd ODI: న్యూజిలాండ్‌పై టీమిండియా సూపర్ విక్టరీ!IND VS NZ{#}Anu Malik;Audi;Kuldeep Yadav;Hardik Pandya;Tom Banton;Tom Hooper;New Zealand;Varsham;Rohit Sharma;VIRAT KOHLI;tuesday;IndiaTue, 24 Jan 2023 23:06:04 GMTఇక ఇండియా టూర్ కి వచ్చిన న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం నాడు (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో ఇండియా ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.ఇక ఈ భారీ విజయంతో ఇండియా 3-0తో సిరీస్‌ని కూడా కైవసం చేసుకోవడమే కాక 2023 వన్డేల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. మూడో మ్యాచ్‌లో భాగంగా మొదట టాస్ గెలిచిన కివీస్ టీమ్ ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది. ఇక ఇండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శుభమాన్ గిల్ ఇంకా రోహిత్ శర్మ చాలా దూకుడుగా ఆడడమే కాక ఇద్దరూ కూడా శతకాలతో ఒక రేంజిలో చెలరేగారు. హిట్ మ్యాన్ 101 పరుగులు (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు.తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ కూడా నిదానంగా ఆడుతున్న క్రమంలో గిల్ 112 (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవీలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కోహ్లీ కొంత సేపు ఆడి 36 పరుగులతో వెనుదిరిగాడు. ఆ తరువాత మిడిలార్డర్‌లో వచ్చిన వారంతా కూడా విఫలమవుతున్న తరుణంలో హార్దిక్ పాండ్యా ఏకంగా 54 పరుగులతో మెప్పించాడు. ఇంకా అలాగే మరో వైపు శార్దూల్ ఠాకూర్ కూడా 17 బంతుల్లో 25 పరుగులు చేశాడు.


ఈ క్రమంలోనే నిర్ణీత ఓవర్లలో ఇండియా 9 వికెట్ల నష్టానికి మొత్తం 385 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ ఇంకా అలాగే బ్లెయిర్ టిక్కర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా బ్రేస్వెల్ ఒక వికెట్ తీశాడు.తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ జట్టు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిన్ అలెన్‌ను డకౌట్ చేశాడు. తరువాత డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో న్యూజిలాండ్‌ తరపున కొంచెం సేపు పరుగుల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే కుల్దీప్ బౌలింగ్‌లో హెన్రీ నికోలస్ మొత్తం 42 పరుగుల వద్ద తన వికెట్ ని కోల్పోయాడు. తరువాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, టామ్ లాథమ్‌, గ్రెన్ ఫిలిప్స్‌లను శార్దూల్ ఠాకుర్ పెవీలియన్ దారి పట్టించడంతో న్యూజిలాండ్ కొంచెం నిరూత్సాహపడినట్లయింది. అయితే నాన్ స్ట్రైకర్‌గా వచ్చిన డెవీన్ కెన్వాయ్ సెంచరీతో బాగా మెరిసాడు. మొత్తం 100 బంతుల్లో 8 సిక్సర్లు, 12 ఫోర్లతో 138 పరుగులు చేసిన కన్వాయ్ 32వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో తన వికెట్ ని కోల్పోయాడు.ఇక ఆ తర్వాత వచ్చిన వారిలో బ్రేస్‌వెల్(26), సాన్ట్నార్(34) మినహా వచ్చినవారంతా కూడా దెబ్బకు చేతులేత్తేశారు. ఇక మొత్తం 42 ఓవర్లోనే కివీస్ జట్టు తన 10 వికెట్లను కోల్పోయి కేవలం 295 పరుగులకే పరిమితమయింది. అందువల్ల న్యూజిలాండ్ టీమ్‌పై భారత్ 90 పరుగుల తేడాతో మూడో మ్యాచ్ గెలవడంతో పాటు వన్డే సిరీస్‌ను కూడా 3-0 తో తన సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ గా శార్దూల్ ఠాకూర్ ఇంకా మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా శుభమాన్ గిల్ నిలిచారు.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>