SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith-sharma-30th-centuryc6998289-f5db-4941-9afd-e066f549d72e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith-sharma-30th-centuryc6998289-f5db-4941-9afd-e066f549d72e-415x250-IndiaHerald.jpgమనము అనుకున్న విధంగానే ఇండోర్ స్టేడియం లో పరుగుల వరద పారుతోంది. గ్రౌండ్ కు అన్ని వైపులా ఇండియా ఆటగాళ్లు పరుగుల జాతర చేసుకుంటున్నారు. వన్ డే సిరీస్ లో భాగంగా మూడవ వన్ డేలో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ మరియు శుబ్ మాన్ గిల్ లు ఆరంభం నుండి కివీస్ బౌలర్లపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ఈ దశలో ఇద్దరూ కూడా సెంచరీలు సాధించడం గమనార్హం.Rohith-sharma-30th-century{#}Rikkee;Sachin Tendulkar;Rohit Sharma;king;King;Cricket;Indore;VIRAT KOHLI;Indiaరో"హిట్" మ్యాన్ శతకొట్టాడు... రికీ పాంటింగ్ సరసన రోహిత్ !రో"హిట్" మ్యాన్ శతకొట్టాడు... రికీ పాంటింగ్ సరసన రోహిత్ !Rohith-sharma-30th-century{#}Rikkee;Sachin Tendulkar;Rohit Sharma;king;King;Cricket;Indore;VIRAT KOHLI;IndiaTue, 24 Jan 2023 16:03:16 GMTమనము అనుకున్న విధంగానే ఇండోర్ స్టేడియం లో పరుగుల వరద పారుతోంది. గ్రౌండ్ కు అన్ని వైపులా ఇండియా ఆటగాళ్లు పరుగుల జాతర చేసుకుంటున్నారు. వన్ డే సిరీస్ లో భాగంగా మూడవ వన్ డేలో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ మరియు శుబ్ మాన్ గిల్ లు ఆరంభం నుండి కివీస్ బౌలర్లపై ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. ఈ దశలో ఇద్దరూ కూడా సెంచరీలు సాధించడం గమనార్హం.. వీరిద్దరినీ విడదీయడానికి కివీస్ కెప్టెన్ మరియు బౌలర్లు ఎంత శ్రమించినా ఉపయోగం లేకుండా పోయింది. గత కొంతకాలంగా రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ ఫామ్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రోజు ఇన్నింగ్స్ తో వాటన్నింటికీ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. రోహిత్ శర్మ 85 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ చేసి బ్రెసెవెల్ అవుట్ అయ్యాడు. రోహిత్ కు తన కెరీర్ లో ఇది 30 వ సెంచరీ కావడం విశేషం. ఇతనికి శుబ్ మాన్ గిల్ నుండి చక్కని సహకారం లభించింది. గిల్ (112) సైతం కెరీర్ లో నాలుగవ సెంచరీని అందుకున్నాడు.  వన్ డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ సెంచరీలు చేసి అందరికీ అందనంత ఎత్తులో టాప్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత కింగ్ విరాట్ కోహ్లీ 46 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మూడవ స్థానంలో రోహిత్ శర్మ 30 మరియు రికీ పాంటింగ్ 30 సెంచరీలతో మూఢవ స్థానంలో ఉన్నారు.

రిక్కీ పాంటింగ్ ఇప్పటికే రిటైర్ కాగా , రోహిత్ మరియు కోహ్లీ లకు ఇంకా ఆడే అవకాశం అది కాబట్టి ఎక్కువ సెంచరీలు చేసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో సెంచరీని సాధిస్తాడా అన్నది తెలియాలంటే మరికొంతసేపు వేచి చూడాలి.  





RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>