PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagancd328eea-3523-4cd5-9b82-ab2027c27e2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagancd328eea-3523-4cd5-9b82-ab2027c27e2e-415x250-IndiaHerald.jpgఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అనూహ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించిన విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి ప్రజలు సినిమా చూడటానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి...ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలని తగ్గించింది. ఇది మంచి విషయమే..మిగిలిన వాటిల్లో కూడా ధరలు తగ్గిస్తే ఇంకా బాగుండేది అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. jagan{#}Raccha;Pawan Kalyan;Hero;Jagan;Government;YCP;Cinema;Andhra Pradeshహీరోల ఎఫెక్ట్: జగన్‌కు నష్టం లేదా?హీరోల ఎఫెక్ట్: జగన్‌కు నష్టం లేదా?jagan{#}Raccha;Pawan Kalyan;Hero;Jagan;Government;YCP;Cinema;Andhra PradeshSat, 25 Dec 2021 20:00:00 GMTఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అనూహ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి సినిమా టిక్కెట్ల రేట్లని తగ్గించిన విషయం తెలిసిందే. పేద, మధ్యతరగతి ప్రజలు సినిమా చూడటానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి...ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలని తగ్గించింది. ఇది మంచి విషయమే..మిగిలిన వాటిల్లో కూడా ధరలు తగ్గిస్తే ఇంకా బాగుండేది అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది.

సరే ఆ విషయం పక్కనబెడితే సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం వల్ల...తమకు నష్టమే వస్తుందని చెప్పి...కొందరు థియేటర్లని క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పలు థియేటర్లు మూతపడ్డాయి. అయితే టికెట్ల రేట్ల అంశంపై ఇదివరకే పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో పవన్‌కు ఏపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. తాజాగా హీరో నాని కూడా టిక్కెట్ల రేట్లపై స్పందించారు..ఇక నానికి కూడా మంత్రులు కౌంటర్లు ఇచ్చేశారు.

అంటే ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఇక ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే సినిమా ఇండస్ట్రీకి భారీగానే నష్టాలు వచ్చేలా ఉన్నాయి. పైగా రాను రాను పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవి భారీ బడ్జెట్ సినిమాలు...టిక్కెట్ల రేట్లు 10,15 రూపాయిలు ఉంటే పెద్ద సినిమాలకు ఏ మాత్రం ఉపయోగ పడవు. అయితే ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించేందుకు సినీ పెద్దలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత..ప్రభుత్వంతో మాట్లాడటానికి సిద్ధమవుతున్నారు.

కానీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందో లేదో తెలియని పరిస్తితి. కాకపోతే ఇక్కడ కొందరు బడా హీరోల ఫ్యాన్స్, వైసీపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అయినా సరే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. అలాగే తమకు హీరోల సపోర్ట్ అవసరం లేదు...జగనే హీరో అన్నట్లు వైసీపీ నేతలు ముందుకెళుతున్నారు. మరి భవిష్యత్‌లో సినీ హీరోల ఫ్యాన్స్ వల్ల ఏమన్నా వైసీపీకి నష్టం జరుగుతుందో లేదో చూడాలి.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మల్లన్న కమలాన్ని లేపుతున్నారా? ముంచుతున్నారా?

టీడీపీలో నాగార్జునని కూడా మార్చాల్సిందేనా..?

క్రిస్మస్ స్పెషల్ : ఎగ్స్, ఓవెన్ లేకుండా బ్లాక్ ఫారెస్ట్ కేక్

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>