PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpf91576d0-8f11-480b-ab68-bb383175a264-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpf91576d0-8f11-480b-ab68-bb383175a264-415x250-IndiaHerald.jpgమదనపల్లి వైసీపీ పార్టీలో మూడు ముక్కలాట మొదలైనట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు పూర్తి కాగానే ఆ పార్టీలో కలకలం మొదలయ్యాయని సమాచారం అందుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే నవాజ్ భాష ఒక్కరే అన్ని తానై మదనపల్లిలో వ్యవహరిస్తున్నారు. వైసిపి పార్టీ పరంగా మున్సిపల్ మరియు మండల స్థాయిలో నాయకులు మరియు ప్రజాప్రతినిధులకు అటు పార్టీ, అలాగే ఇటు ప్రభుత్వ కార్యక్రమాలలో అవకాశం ఇవ్వకుండా దూసుకు వెళ్తున్నారు. వైసిపి పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని మంగళవారం మదనపల్లిలో ycp{#}pawan kumar;Madanapalli;Assembly;tuesday;Yevaru;Jagan;Hanu Raghavapudi;News;MLA;YCP;Reddy;CM;local language;Partyవైసీపీలో మూడుముక్కలాట.. రంగంలోకి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ?వైసీపీలో మూడుముక్కలాట.. రంగంలోకి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ?ycp{#}pawan kumar;Madanapalli;Assembly;tuesday;Yevaru;Jagan;Hanu Raghavapudi;News;MLA;YCP;Reddy;CM;local language;PartySat, 25 Dec 2021 11:51:27 GMTమదనపల్లి వైసీపీ పార్టీలో మూడు ముక్కలాట మొదలైనట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు పూర్తి కాగానే ఆ పార్టీలో కలకలం మొదలయ్యాయని సమాచారం అందుతోంది.  ఇప్పటివరకు ఎమ్మెల్యే నవాజ్ భాష ఒక్కరే అన్ని తానై మదనపల్లిలో వ్యవహరిస్తున్నారు. వైసిపి పార్టీ పరంగా మున్సిపల్ మరియు మండల స్థాయిలో నాయకులు మరియు ప్రజాప్రతినిధులకు అటు పార్టీ, అలాగే ఇటు ప్రభుత్వ కార్యక్రమాలలో అవకాశం ఇవ్వకుండా దూసుకు వెళ్తున్నారు. వైసిపి పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని మంగళవారం మదనపల్లిలో మూడు వర్గాలు వేరువేరుగా చేసుకున్నాయి.

ఇక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎప్పటిలాగే జడ్పి ఉన్నత పాఠశాలలో కేక్ కటింగ్ తో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు నేతలు. నియోజకవర్గంలో మున్సిపాలిటీ మరియు మండలాల తో కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే. అయితే అటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మరియు అనుచరులు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. వీరందరూ ఒక ఎత్తు అయితే తాజాగా మూడో వ్యక్తి.. మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఇ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు కూడా గ్రాండ్గా చేశారు. జిల్లాలో ఎవరు ఎన్నడు చేయనీ తరహాలో హెలికాప్టర్ లో జగన్ కటౌట్ పై పూలు చల్లాలని ప్లాన్ చేసి విఫలమై పోయారు. ఇక పవన్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లో మూడు రౌండ్లు వేసి.. తిరిగి బెంగుళూరు వెళ్లారని సమాచారం.

ప్రత్యర్థి వర్గం అడ్డు పడటం కారణంగానే హెలికాప్టర్ కు అనుమతి లభించలేదని చెబుతున్నారు ఆయన అనుచరులు. ఇక బిటి కళాశాల మైదానంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నారు ఆయన అనుచరులు. పార్టీలో స్థానిక ప్రజాప్రతినిధికి వ్యతిరేక వర్గం పవన్ కుమార్ రెడ్డి వెంట నడిచింది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి మదనపల్లి నియోజకవర్గం పై కన్నేశారు పవన్ కుమార్ రెడ్డి. గత కొంత కాలంలో వైసీపీ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ... అటు సీఎం జగన్కు అలాగే పెద్దిరెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా మదనపల్లిలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని మల్లెల పవన్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే శతవిధాల ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

యూపీ పోరు... గెలిచేదెవ‌రు..?

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>