PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambaniff631927-8a5c-49f8-b73d-158ee35fbb98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ambaniff631927-8a5c-49f8-b73d-158ee35fbb98-415x250-IndiaHerald.jpgముకేశ్ అంబానీ.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు.. ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. మరి అలాంటి అంబానీ.. కాస్త సమయం దొరికితే ఏంచేస్తారు.. కొత్త ఆలోచనల కోసం ఏం పుస్తకాలు చదువుతారు.. అన్న ఆసక్తి సహజమే కదా. మరి ఈ 2021 ఏడాదిలో అంబానీ ఏం పుస్తకాలు చదివారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను చదవడమే కాదు.. మీరు చదవండని సూచిస్తున్నారు. అలాంటి వాటిలో మొదటి కరోనా గురించిన పుస్తకమేనట. ఫరీద్ జకారియా రాసిన టెన్‌ లెసెన్స్‌ ఫర్‌ ఏ పోస్ట్‌ పాండమిక్‌ వరల్డ్‌ అనే పుస్తకం అంబానీకి బాగా నచ్చిందట. కొవిడ్‌తో పాటు ప్రపంచambani{#}Coronavirusఅంబానీ చదివిన పుస్తకాలివిగో.. మీరూ చదువుతారా..?అంబానీ చదివిన పుస్తకాలివిగో.. మీరూ చదువుతారా..?ambani{#}CoronavirusSat, 25 Dec 2021 00:00:00 GMTముకేశ్ అంబానీ.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు.. ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. మరి అలాంటి అంబానీ.. కాస్త సమయం దొరికితే ఏంచేస్తారు.. కొత్త ఆలోచనల కోసం ఏం పుస్తకాలు చదువుతారు.. అన్న ఆసక్తి సహజమే కదా. మరి ఈ 2021 ఏడాదిలో అంబానీ ఏం పుస్తకాలు చదివారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను చదవడమే కాదు.. మీరు చదవండని సూచిస్తున్నారు. అలాంటి వాటిలో మొదటి కరోనా గురించిన పుస్తకమేనట. ఫరీద్ జకారియా రాసిన టెన్‌ లెసెన్స్‌ ఫర్‌ ఏ పోస్ట్‌ పాండమిక్‌ వరల్డ్‌ అనే పుస్తకం అంబానీకి బాగా నచ్చిందట.


కొవిడ్‌తో పాటు ప్రపంచాన్ని భయపట్టిన మరికొన్ని వైరస్‌ల వ్యాప్తి.. సంక్షోభ సమయాల్లో ఏం జరిగింది.. అనే అంశాలను వివరిస్తూ ఈ పుస్తకం ఉంటుందట. నిలకడలేనిప్రజల జీవనశైలి, బలహీన ప్రభుత్వాల వల్ల ఎలాంటి సంక్షోభాలు ఏర్పడతాయో ఈ పుస్తకంలో వివరించారట. సమర్థ నాయకత్వం, జీవనశైలిలో మార్పుల వల్ల ఎంతో లాభం ఉంటుందని ఈ పుస్తకం చెబుతుందట.


అంబానీ సూచిస్తున్న మరో పుస్తకం.. రే డాలియో రాసిన ప్రిన్సిపల్స్‌ ఫర్‌ డీలింగ్‌ విత్‌ ది చేంజింగ్‌ వరల్డ్‌ ఆర్డర్‌: వై నేషన్స్‌ సక్సీడ్‌ అండ్‌ ఫెయిల్‌’. ఈ పుస్తకం గత 500 ఏళ్లలో ప్రపంచంలో జరిగిన గొప్ప రాజకీయ, ఆర్థిక విజయాలు, పరాజయాలపై రాసిన పుస్తకమట. ప్రస్తుతంఉన్న కఠిన సమయం కంటే రాబోయే కాలం ఎలా భిన్నంగా ఉంటుందో ఈ పుస్తకం చెప్పిందట. పాలకులు, వ్యాపారవేత్తలు, అధికారులు, యువత ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలంటున్నారు అంబానీ.


ఆయన సూచిస్తున్న మరో పుస్తకం అలెక్‌ రాస్‌ రాసిన ది ర్యాగింగ్‌ 2020ఎస్‌: కంపెనీస్‌, కంట్రీస్‌, పీపుల్‌ - అండ్‌ ది ఫైట్‌ ఫర్‌ అవర్‌ ఫ్యూచర్‌. కార్పొరేట్‌ వ్యవహారాలు, ప్రభుత్వాల పనితీరు, ప్రపంచ వ్యాప్త వినూత్న ఆర్థిక, రాజకీయ నమూనాల గురించి ఈ బుక్ చెబుతుందట. ఇవే కాకుండా మౌరో గిల్లెన్‌ రాసిన 2030: హౌ టుడేస్‌ బిగ్గెస్ట్‌ ట్రెండ్స్‌ విల్‌ కొల్లైడ్‌ అండ్‌ రీషేప్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌, జోస్‌ లింకర్‌ రాసిన బిగ్‌ లిటిల్‌ బ్రేక్‌థ్రూస్‌: హౌ స్మాల్‌, ఎవ్రీడే ఇన్నోవేషన్స్‌ డ్రైవ్‌ ఓవరైజ్డ్‌ రిజల్ట్స్‌ అనే పుస్తకాలు కూడా చదవాలని అంబానీ సూచిస్తున్నారు. మరి చదువుతారా..?



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>