PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-modiaebc0ec7-cb55-4cbf-9c3b-5ce3ee67e198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-modiaebc0ec7-cb55-4cbf-9c3b-5ce3ee67e198-415x250-IndiaHerald.jpgప్రాంతీయ పార్టీల‌తో త‌మ రాజ‌కీయ‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆట‌లాడుతూ, స‌మ‌యం చూసి వాటిని దెబ్బ‌తీసి అక్క‌డ పాగా వేయ‌డ‌మే బీజేపీ ప్ర‌స్తుత అధినాయ‌క‌త్వం రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌గా ఉంటోంది. తూర్పున బెంగాల్ మొద‌లుకుని ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నింటిలో ప్ర‌స్తుతం బీజేపీ చేస్తున్న‌ద‌దే. అయితే కొన్ని రాష్ట్రాల్లో వీరి వ్యూహాలు ఫ‌లించినా మ‌రికొన్ని రాష్ట్రాల్లో ఇదేమంత సుల‌భం కాద‌న్న‌సంగ‌తి వారికి క్ర‌మంగా తెలిసివ‌స్తోంది.KCR-Modi{#}West Bengal - Kolkata;local language;Party;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Bharatiya Janata Party;Congressకేసీఆర్ స్కెచ్ వేస్తే అంతే మ‌రి..?కేసీఆర్ స్కెచ్ వేస్తే అంతే మ‌రి..?KCR-Modi{#}West Bengal - Kolkata;local language;Party;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Bharatiya Janata Party;CongressSat, 25 Dec 2021 11:15:00 GMTబీజేపీ ప్ర‌స్తుత అధినాయ‌క‌త్వం రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌గా ఉంటోంది. తూర్పున బెంగాల్ మొద‌లుకుని ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నింటిలో ప్ర‌స్తుతం బీజేపీ చేస్తున్న‌ద‌దే. అయితే కొన్ని రాష్ట్రాల్లో వీరి వ్యూహాలు ఫ‌లించినా మ‌రికొన్ని రాష్ట్రాల్లో ఇదేమంత సుల‌భం కాద‌న్న‌సంగ‌తి వారికి క్ర‌మంగా తెలిసివ‌స్తోంది. ఈ విష‌యంలో బీజేపీకి తొలిసారిగా గ‌ట్టి ఝ‌ల‌క్ ఇచ్చింది.. బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌తాబెన‌ర్జీ అని చెప్పాలి. ఆ రాష్ట్రంలో కాషాయ‌జెండా ఎగుర‌వేసేందుకు బీజేపీ కేంద్రంలో త‌న అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించింది. సామ‌దాన భేద దండోపాయాల‌న్నింటినీ ప్ర‌యోగించింది. మ‌మ‌త పార్టీ టీఎంసీ నుంచి కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌ను బీజేపీలోకి ఆక‌ర్షించి వారినే ఆమెకు వ్య‌తిరేకంగా ప్ర‌యోగించింది. అయితే అంతిమంగా బీజేపీ ప్ర‌యోగం విక‌టించింది. బెంగాల్ ప్ర‌జ‌లు దీదీ ప‌క్క‌నే నిలిచి బీజేపీని తిర‌స్క‌రించారు. దేశంలో మోదీషాల ను ఎదిరించి నిలువ‌రించిన గ‌ట్టి నేత‌గా మ‌మ‌త ఆవిర్భ‌వించారు. ఇది ఎంత‌మాత్రం స‌హించ‌లేక‌పోయిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆ ప్ర‌భుత్వంపై నిరంత‌రం వేధింపుల‌కు పాల్ప‌డుతుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి.
   
           ఇక ఆ త‌రువాత మ‌మ‌త బాట‌లోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీకి స‌హ‌జంగానే కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన శ‌త్రువు. అందుకే మొద‌ట్లో పైకి ఎలా మాట్లాడినా అంత‌ర్గ‌తంగా కేసీఆర్‌తో స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారు. తాము కాస్త బ‌లం పుంజుకున్నామ‌న‌గానే అక్క‌డ అధికార పీఠంపై దృష్టి పెట్టారు. కేసీఆర్‌ను బ‌ద్నాం చేసేందుకు స్థానిక బీజేపీ నాయ‌క‌త్వాన్ని దూకుడుగా వెళ్లేలా ప్రోత్స‌హిస్తున్నారు. ఆ పార్టీ దూకుడుకు మొద‌ట్లో కాస్త జంకినా ఆ త‌ర్వాత కేసీఆర్ విరుగుడు వ్యూహాలు ర‌చించ‌డం మొద‌లుపెట్టారు. ఇందుకు అందివ‌చ్చిన  అంశ‌మే రైతుల నుంచి ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు వ్య‌వ‌హారం. దీన్నికేసీఆర్‌కు వ్య‌తిరేకంగా బీజేపీ వాడుకుందామ‌ని చూస్తే, దాన్నిఏకంగా జాతీయ స్థాయిలో బీజేపీ ప్ర‌భుత్వం మెడ‌కే చుట్టేందుకు కేసీఆర్ వ్యూహం ర‌చించారు. ధాన్యం కొనుగోలు, మ‌ద్ద‌తు ధ‌ర‌లు ప్ర‌ధానంగా కేంద్రం ప‌రిధిలోనివే. అంతేకాదు.. ఈ అంశం ఇత‌ర రాష్ట్రాల్లోనూ ప్ర‌భావం చూపుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఇదే విష‌య‌మై ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోతే తీసుకువ‌చ్చి ఢిల్లీగేట్ ముందు పోస్తామంటూ రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే ఉత్త‌రాది రైతుల్లో బీజేపీపై ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ఎదురుగా యూపీ ఎన్నిక‌లున్నాయి. అక్క‌డ రైతు సంఘాల‌ది బ‌ల‌మైన ఓటు బ్యాంకు. ఈ స‌మ‌యంలో కేసీఆర్ ఎంచుకున్న అంశం బీజేపీకి న‌ష్టం క‌లిగించేదే. మ‌రి బీజేపీ కేసీఆర్‌ను ఎలా నిలువ‌రిస్తుందో చూడాలి.


శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

యూపీ పోరు... గెలిచేదెవ‌రు..?

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>