PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wow-the-biggest-telescope-in-space-special-54aadc67-2ed3-4278-9a36-9ef7f6075887-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wow-the-biggest-telescope-in-space-special-54aadc67-2ed3-4278-9a36-9ef7f6075887-415x250-IndiaHerald.jpgనాసా అరుదైన ఘనత సాధించింది. తాజాగా జరిపిన ప్రయోగంలో విజయం సాధించింది. అంతరిక్షంలోకి అతిపెద్ద టెలిస్కోప్ ను పంపించి శభాష్ అనిపించుకుంటోంది. ఆ టెలిస్కోప్ ద్వారా ఎన్నో రహస్యాలు బయటపడనున్నాయి. దీంతో నాసా శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. Wow The biggest telescope in space special {#}Canada;A P J Abdul Kalam;Shakti;NASA;James Cameron;Europe countriesవావ్ : అంతరిక్షంలో అతిపెద్ద టెలిస్కోప్.. ప్రత్యేకతలివే..!వావ్ : అంతరిక్షంలో అతిపెద్ద టెలిస్కోప్.. ప్రత్యేకతలివే..!Wow The biggest telescope in space special {#}Canada;A P J Abdul Kalam;Shakti;NASA;James Cameron;Europe countriesSat, 25 Dec 2021 21:00:00 GMTప్రపంచంలోనే అతిపెద్ద జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. గయానా స్పేస్ సెంటర్ నుంచ యూరప్ అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. 10బిలియన్ డాలర్ల విలువైన ఈ టెలిస్కోప్.. విశ్వం పుట్టుక, 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గేలక్సీ గుట్టు విప్పనుంది. దీని ద్వారా సైంటిస్టులు నక్షత్రాలు, పాలపుంతలను పరిశీలించనున్నారు.

అంతరిక్షంలోక పంపిన అతిపెద్ద టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వెయ్యి కోట్ల రెట్ల క్లారిటీతో చూడవచ్చు. హబుల్ టెలిస్కోప్ కంటే రెండున్నర రెట్లు ఈ టెలిస్కోప్ పెద్దది. వెయ్యి రెట్ల క్లారిటీతో ఫోటోలు తీస్తుంది. 21అడుగుల పొడవైన ఈ టెలిస్కోప్ తయారీకి 75వేల కోట్లు ఖర్చు చేశారు. నాసా, యూరోపియన్, కెనడా స్పేస్ ఏజెన్సీలు కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి.

నాసా మరో విషయాన్ని వెల్లడించింది. సూర్యుని వల్ల భూమికి ముప్పు పొంచి ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రతి 11ఏళ్లకు ఒకసారి సూర్యునిలో అయస్కాం దృవాలు మారుతుంటాయి. ఈ క్రమంలో భారీ శక్తి విడుదలై సౌర తుపానుగా మారుతుంది. ఈ క్రమంలోనే అతి త్వరలో రెండు సౌర తుపానులు భూమివైపు దూసుకురానున్నాయని సైంటిస్టులు తెలిపారు. వీటి వల్ల రేడియో కమ్యూనికేషన్, ఇంటర్నెట్, జీపీఎస్ వ్యవస్థలు, పవర్ గ్రిడ్ లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

ఇక ఈ నెల 22వ తేదీ ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం జరిపింది. ప్రళయ్ పేలోడ్ సామర్థ్యం 500నుంచి 1000కిలోలు. 150-500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు. అయితే ఈ స్వల్ప శ్రేణి మిస్సైల్.. నిర్దేశిత లక్షఅయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని డీఆర్డీవో ప్రకటించింది. నాసా మరిన్ని ప్రయోగాలు జరిపి.. ప్రపంచానికి కొత్త విషయాలు తెలియజేయాలని మనమూ కోరుకుందాం.







శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఒక ఎమ్మెల్యే వ్య‌ధ‌: ఈనాటి సీత క‌న్నీటి రాత ఎందుక‌ని..?

టీడీపీలో నాగార్జునని కూడా మార్చాల్సిందేనా..?

క్రిస్మస్ స్పెషల్ : ఎగ్స్, ఓవెన్ లేకుండా బ్లాక్ ఫారెస్ట్ కేక్

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>