PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanc68c0ac5-8dc2-4d0b-bf76-71dcd4c409f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyanc68c0ac5-8dc2-4d0b-bf76-71dcd4c409f6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమకు మద్దతుగా, ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హీరో నాని స్పందించారు. టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంతో ఇండస్ట్రీకి ముఖ్యంగా థియేటర్ల ఓనర్లకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. అదే సమయంలో కిరాణా కొట్టు కౌంటర్, థియేటర్ కౌంటర్ అంటూ కాస్త సెటైరిక్ గా మాట్లాడే సరికి నానిపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ పై మాట్లాడి సంచలనం సృష్టించారు. అప్పట్లో పవన్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్టుగా వార్ నడిచింది. మరిప్పుడు నాని కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ దశలో పవన్,pawan kalyan{#}cinema theater;Episode;Industry;war;Chiranjeevi;court;Pawan Kalyan;Government;Hero;you tube;Andhra Pradesh;Cinema;Naniనానికి మద్దతుగా మాట్లాడతావా పవన్..?నానికి మద్దతుగా మాట్లాడతావా పవన్..?pawan kalyan{#}cinema theater;Episode;Industry;war;Chiranjeevi;court;Pawan Kalyan;Government;Hero;you tube;Andhra Pradesh;Cinema;NaniFri, 24 Dec 2021 06:49:55 GMTతెలుగు సినీ పరిశ్రమకు మద్దతుగా, ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హీరో నాని స్పందించారు. టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంతో ఇండస్ట్రీకి ముఖ్యంగా థియేటర్ల ఓనర్లకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. అదే సమయంలో కిరాణా కొట్టు కౌంటర్, థియేటర్ కౌంటర్ అంటూ కాస్త సెటైరిక్ గా మాట్లాడే సరికి నానిపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఇదే పాయింట్ పై మాట్లాడి సంచలనం సృష్టించారు. అప్పట్లో పవన్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్టుగా వార్ నడిచింది. మరిప్పుడు నాని కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఈ దశలో పవన్, నానికి మద్దతిస్తారా.. ఆయన్ని సపోర్ట్ చేస్తారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చేసింది. సినిమా టికెట్ల ఆన్లైన్ వ్యవహారం, రేట్ల తగ్గింపుపై గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించలేదు, పునరాలోచించాలని మాత్రమే కోరారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అవసరమైతే తన సినిమాలు ఫ్రీగా చూపించేస్తానంటూ గట్టిగా మాట్లాడారు. పవన్ ఎపిసోడ్ లో ఇండస్ట్రీ కూడా ఓ దశలో ఇబ్బందుల్లో పడిందని అనుకున్నారు. పవన్ వ్యాఖ్యల తర్వాత నిర్మాతలంతా ఏపీ ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు, సర్దుబాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చేసింది. బెనిఫిట్ షో లు, ఎక్స్ ట్రా షోలు వద్దని తేల్చి చెప్పింది. దీనిపై కోర్టు కేసు నడుస్తోంది.

తాజాగా నాని మరోసారి ఈ వివాదంలోకి వచ్చారు. నాని నేరుగా ప్రభుత్వంపైనే సెటైర్లు పేల్చే సరికి మరోసారి ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈసారి కూడా ఇండస్ట్రీనుంచి ఎవరూ నానికి సపోర్ట్ గా మాట్లాడలేదు. ఆ సాహసం చేయలేదు. అయితే నానికి వ్యతిరేకంగా కొంతమంది బయటికొచ్చారు, అటు ప్రభుత్వం నుంచి వాయింపుడు మొదలైంది. దీంతో సరిగ్గా సినిమా రిలీజ్ టైమ్ లో నాని ఇలా ఎందుకు చేశాడబ్బా అని చాలామంది ఆశ్చర్యపోయారు. నాని కూడా ఈ వ్యవహారం ఇంత వరకు వస్తుందనుకోలేదు. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ తో చిక్కొస్తుందని కీడు శంకించారు కానీ అది వైరల్ అయిపోయింది. చివరకు వివాదంగా మారింది. మరి గతంలో ఇదే వివాదానికి కారణం అయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటారా..? లేదా నానికి సపోర్ట్ గా వస్తారా అనేదే అసలు ప్రశ్న. పవన్ సపోర్ట్ వచ్చినా రాకపోయినా, ఇప్పటికే కొంతమంది జనసైనికులు నాని వీడియోకి మద్దతిస్తూ వైరల్ చేస్తున్నారు. మరి పవన్ కూడా నేరుగా స్టేట్ మెంట్ ఇస్తారేమో చూడాలి.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్ వ్యూహాలు: ముందస్తు విజయం వరిస్తుందా..లేదా..!

నాని శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ టాక్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>