Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy0319b27d-5014-49c9-bc6f-ad76864963e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy0319b27d-5014-49c9-bc6f-ad76864963e7-415x250-IndiaHerald.jpgమన పక్కింటి అబ్బాయిగా కనిపించే న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య చేస్తున్న సినిమాలోని పాత్రలన్ని ఒకేవిధంగా అనిపిస్తున్నాయి. తను చేసిన సినిమాలు.. అందులో పాత్రల గురించి చూస్తే క్యారక్టరైజేషన్ లో పెద్దగా డిఫరెన్స్ లేదని అర్ధమవుతుంది. అందుకే నాని ఈమధ్య ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. Vలో నెగటివ్ రోల్ చేసినా.. టక్ జగదీష్ లో జగతీ పాత్ర చేసినా పూర్తిగాShyam Singha Roy{#}bhavana;Kurradu;Tuck Jagdish;Tuck Jagadish;Darsakudu;Director;Manam;Nani;shyam;Cinemaనాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!Shyam Singha Roy{#}bhavana;Kurradu;Tuck Jagdish;Tuck Jagadish;Darsakudu;Director;Manam;Nani;shyam;CinemaFri, 24 Dec 2021 20:00:00 GMTమన పక్కింటి అబ్బాయిగా కనిపించే న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య చేస్తున్న సినిమాలోని పాత్రలన్ని ఒకేవిధంగా అనిపిస్తున్నాయి. తను చేసిన సినిమాలు.. అందులో పాత్రల గురించి చూస్తే క్యారక్టరైజేషన్ లో పెద్దగా డిఫరెన్స్ లేదని అర్ధమవుతుంది. అందుకే నాని ఈమధ్య ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. Vలో నెగటివ్ రోల్ చేసినా.. టక్ జగదీష్ లో జగతీ పాత్ర చేసినా పూర్తిగా నాని ఆ పాత్రల్లో ఇమడలేకపోయాడు. ఎందుకంటే నాని అనగానే మన పక్కింటి కుర్రాడు అన్న ఫీలింగ్ ఉంటుంది.

అందుకే అతను ఎంత కొత్తగా చేద్దామని అనుకున్నా ఎక్కడో ఓ చోట ఇతను న్యాచురల్ స్టార్ నాని కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ చట్రం నానికి కొన్ని సార్లు ప్లస్ అవగా మరికొన్ని సార్లు మైనస్ అయ్యాయి. అందుకే నాని ఇక ఒకటే ఫిక్స్ అయ్యాడు. కథ మాత్రమే కాదు తన పాత్ర కూడా కొత్తగా ఉండేలా ఉన్న సినిమాలనే చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శ్యామ్ సింగ రాయ్ సినిమా వచ్చింది. నాని అసలు టాలెంట్ ఏంటన్నది చూపించేలా ఈ సినిమాలో శ్యామ్ సింగ రాయ్ పాత్రలో ఆయన అభినయం ఉండింది.

ఇన్నాళ్లు ఈ నానినే కదా మనం కావాలని కోరుకుంది శ్యామ్ సింగ రాయ్ లాంటి బలమైన పాత్ర వస్తేనే తప్ప నాని ఇలా కొత్తగా కనిపించడా అని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. దర్శకుడు రాసుకున్న పాత్ర ఎంత లోతుగా ఉంటే నటుడు అంత డెప్త్ గా నటించగలడు. ఈ విషయంలో శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నానిని మన పక్కింటి కుర్రాడిగా కాకుండా కొత్తగా చూపించినందుకు దర్శకుడు రాహుల్ కి థ్యాంక్స్ చెప్పాలి. నాని అంటే అందరికి సాఫ్ట్ కార్నర్ ఉన్నా రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న భావన కలిగింది. అయితే ఈ ఫీలింగ్ ఆడియెన్స్ లో ఉందన్న విషయం తనకు తెలిసిందేమో శ్యామ్ సింగ రాయ్ తో తన సత్తా చాటాడు నాని. తను ఎంత పక్కింటి కుర్రాడు అయినా తనలో కూడా బోలెడంత టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.    





శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆర్బీఐ : కార్డ్ టోకనైజేషన్ గడువు పెంపు..

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>