PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5df3879b-5dc9-488b-bb98-dd20da6eda38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5df3879b-5dc9-488b-bb98-dd20da6eda38-415x250-IndiaHerald.jpgఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జంపింగులు తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో నేతల వలసలు కాస్త ఆగినట్లే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య టీడీపీలోకి కాస్త వలసలు జరుగుతున్నాయి. వైసీపీలోకి వలసలు ఆగిపోయాయి. ప్రతిపక్ష టీడీపీ నుంచి ఇంకా వైసీపీలోకి వలసల జోరు నడవటం లేదు. ఇలా వలసలు ఆగిపోవడానికి కారణాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. tdp{#}Cycle;YCP;TDP;Andhra Pradesh;Hanu Raghavapudiనలుగురితో బ్రేక్..ఇంకా సైకిల్ దిగేది లేదా?నలుగురితో బ్రేక్..ఇంకా సైకిల్ దిగేది లేదా?tdp{#}Cycle;YCP;TDP;Andhra Pradesh;Hanu RaghavapudiFri, 24 Dec 2021 03:00:00 GMTఈ మధ్య ఏపీ రాజకీయాల్లో జంపింగులు తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో నేతల వలసలు కాస్త ఆగినట్లే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య టీడీపీలోకి కాస్త వలసలు జరుగుతున్నాయి. వైసీపీలోకి వలసలు ఆగిపోయాయి. ప్రతిపక్ష టీడీపీ నుంచి ఇంకా వైసీపీలోకి వలసల జోరు నడవటం లేదు. ఇలా వలసలు ఆగిపోవడానికి కారణాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.

మామూలుగానే వైసీపీలో నాయకులు ఫుల్‌గా ఉన్నారు. అందుకే మొదట నుంచి వలసలు మందకొడిగానే సాగుతున్నాయి. అదే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా...వలసలు ఎలా నడిచాయో అందరికీ తెలిసిందే. అబ్బో వరుసపెట్టి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి వచ్చేశారు. ఐదేళ్ల పాటు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం చేస్తూనే వచ్చింది. ఇక వలసల వల్ల టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. లిమిట్ దాటి ఓవర్‌గా నాయకులని చేర్చుకుంటే నష్టమే జరుగుతుందని 2019 ఎన్నికల్లో రుజువైంది.

అయితే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న వైసీపీ మొదట్లో వలసలని బాగానే ప్రోత్సహించింది. చాలామంది నాయకులని వైసీపీలో చేర్చుకుంది. అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీలోకి లాగారు. ఇంకా అంతే అక్కడ నుంచి వలసలు పెద్దగా జరగలేదు. అంటే వైసీపీలో నాయకులు ఫుల్‌గా ఉండటంతో వలసలని పెద్దగా ప్రోత్సహించలేదనే చెప్పాలి.

కానీ ఇప్పుడు టీడీపీ నుంచి నాయకులు వైసీపీలోకి వెళ్ళే పరిస్తితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడుప్పుడే టీడీపీ ఫామ్‌లోకి వస్తుంది. దీంతో టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా వైసీపీలోకి వెళ్ళిన పెద్దగా పదవులు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ వైపు చూడటం లేదు. టీడీపీలో కొనసాగితే...కనీసం నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే ఏదొక పదవులు వస్తాయని తమ్ముళ్ళు...ఇంకా సైకిల్ దిగడానికి సిద్ధపడటం లేదు. మొత్తానికైతే ఆ నలుగురుతోనే టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ఇంకా జంపింగ్‌లు ఉండేలా కనిపించడం లేదు.  



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్ వ్యూహాలు: ముందస్తు విజయం వరిస్తుందా..లేదా..!

నాని శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ టాక్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>