MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/india-cinema9f7ad33b-db1e-440d-afc2-76c58a75e02f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/india-cinema9f7ad33b-db1e-440d-afc2-76c58a75e02f-415x250-IndiaHerald.jpgభార‌తీయ సినిమాకు సంబంధించి గ‌త ద‌శాబ్ద‌కాలంలో వ‌చ్చిన గొప్ప మార్పు గురించి త‌ప్ప‌క చెప్పుకోవాలి. అదేంటంటే భాషా భేదాల‌ను, సంస్కృతులు, అభిరుచుల ప‌రంగా వివిధ ప్రాంతాల మ‌ధ్య ఉన్న భిన్న‌త్వాన్ని అధిగ‌మించి ఇండియ‌న్ సినిమా ఒక్క‌ట‌వుతోంది. వైరుధ్యాల‌ను వైవిధ్య భ‌రిత‌మైన క‌థ‌లుగా మ‌లుచుకుంటోంది. India Cinema{#}Tollywood;Kollywood;KGF;Avunu;bollywood;Remake;Chitram;India;Cinemaఒక్క‌టిగా మారుతున్న ఇండియ‌న్‌ సినిమా..?ఒక్క‌టిగా మారుతున్న ఇండియ‌న్‌ సినిమా..?India Cinema{#}Tollywood;Kollywood;KGF;Avunu;bollywood;Remake;Chitram;India;CinemaFri, 24 Dec 2021 20:00:00 GMT         భార‌తీయ సినిమాకు సంబంధించి గ‌త ద‌శాబ్ద‌కాలంలో వ‌చ్చిన గొప్ప మార్పు గురించి త‌ప్ప‌క చెప్పుకోవాలి. అదేంటంటే భాషా భేదాల‌ను, సంస్కృతులు, అభిరుచుల ప‌రంగా వివిధ ప్రాంతాల మ‌ధ్య ఉన్న భిన్న‌త్వాన్ని అధిగ‌మించి ఇండియ‌న్ సినిమా ఒక్క‌ట‌వుతోంది. వైరుధ్యాల‌ను వైవిధ్య భ‌రిత‌మైన క‌థ‌లుగా మ‌లుచుకుంటోంది. దేశంలోని ప్రేక్ష‌కులంద‌రినీ స‌మానంగా ఆక‌ట్టుకునే సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ  భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపుతోంది. అవును ఇది ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు.. నూరు శాతం నిజం. ఒక‌ప్పుడు ఒక భాషా చిత్రాలు మ‌రో ప్రాంతంలో ప‌రాయి చిత్రాలు. కేవ‌లం అతికొద్దిమంది హీరోల చిత్రాల‌కు మాత్ర‌మే ఇది కొంత మిన‌హాయింపు. ప‌ర భాష‌లో ఒక‌మంచి క‌థ‌తో సినిమా వ‌చ్చినా నేటివిటీ లోపించింద‌ని, ఇక్క‌డి ప్రేక్ష‌కులకు అది న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని భావించి, దానిలో మార్పులు చేర్పులు చేసి, త‌మ భాషా న‌టుల‌తో పున‌ర్నిర్మించేందుకే నిర్మాత‌లంద‌రూ ప్ర‌య‌త్నించేవారు. ఇప్ప‌టికీ ఆ ట్రెండ్ లేద‌ని చెప్ప‌లేం కానీ అది ప‌రిమితం. రాబోయే ద‌శాబ్దంలో అస‌లు రీమేక్ సినిమాలుండ‌క‌పోవ‌చ్చు. అవును.. అన్నిభాష‌ల్లోనూ ఒకే న‌టీన‌టుల బృందంతో ఏక‌కాలంలో తెర‌కెక్కే చిత్రాలే ఇక‌పై రాజ్య‌మేలేది. ఒక‌వేళ క‌థ‌కు అవ‌స‌ర‌ముంటే ఇత‌ర భాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా ఇందులో భాగ‌మ‌వుతారంతే.

          గ‌తంలో బాలీవుడ్ మార్కెట్ పరిధి పెద్ద‌ది. తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కు అప్ప‌ట్లో సొంత రాష్ట్రమే ప్ర‌ధాన మార్కెట్‌. విజ‌య‌వంత‌మైన చిత్రాలు మాత్ర‌మే ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లో డ‌బ్బింగ్ చిత్రాలుగా వ‌చ్చి ప‌రిమిత‌మైన ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగ‌లిగేవి. క‌న్న‌డ సినిమా మార్కెట్ చాలా చిన్న‌ది. ఆ ఇండ‌స్ట్రీని కాపాడుకోవ‌డానికి డ‌బ్బింగ్ చిత్రాల‌పై ఆంక్ష‌లుండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. శాండ‌ల్‌వుడ్ నుంచి వ‌చ్చిన కేజీఎఫ్ చిత్రం దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమా క‌థానాయ‌కుడు య‌ష్ ఇప్పుడో పాన్ ఇండియా హీరో. కేజీఎఫ్ సీక్వెల్ కోసం ఇప్పుడు దేశ‌మంతా ఎదురు చూస్తోంది. ఇక టాలీవుడ్ మేటి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి త‌న బాహుబ‌లితో భార‌తీయ వెండితెర‌పై సృష్టించిన సంచ‌ల‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి త‌దుప‌రి చిత్రం ఆర్ఆర్ఆర్ పై అంత‌కుమించిన అంచ‌నాలున్నాయి. ఇక కోలీవుడ్ కూడా ఈ బాట‌లో ఒక అడుగు ముందే న‌డుస్తోంది. శంక‌ర్‌, మురుగ‌దాస్ వంటి డైరెక్ట‌ర్లు ఎప్పుడో పాన్ ఇండియా స్థాయి సినిమాల‌పై క‌న్నేశారు. మ‌రోప‌క్క పెరిగిన సాంకేతిక‌త‌, ఓటీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావ‌డంతో అన్నిభాష‌ల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు దేశంలో అంద‌రికీ చేరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో పెద్ద సినిమా, చిన్న సినిమా తేడాలే గానీ భాషాప‌ర‌మైన తేడాలుండ‌వ‌నే చెప్పాలి. అంటే భార‌తీయ సినిమా ఒక్క‌టిగా మారి త‌న మార్కెట్‌తో పాటు స్థాయినీ పెంచుకుంటోంద‌న్న‌మాట‌.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

బన్నీ కార్ వ్యాన్ ఆపేసిన ఆ గ్రామ ప్రజలు.. సినిమాపురంలో ఏం జరిగింది..?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>