PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew-in-the-state-for-omicron-buildingaa39dfca-7c50-49c2-a346-ae6f66a9e8fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew-in-the-state-for-omicron-buildingaa39dfca-7c50-49c2-a346-ae6f66a9e8fe-415x250-IndiaHerald.jpgఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాల్లో అలజడి రేపుతోంది. ఆ మహమ్మారి వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. మాస్క్.. శానిటైజర్ తో పాటు వ్యాక్సిన్ ను తప్పనిసరి చేస్తున్నాయి. అంతేకాదు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని పలు ఆంక్షలు విధిస్తున్నాయి. Night curfew in the state for Omicron building{#}East Godavari;Prime Minister;Gift;Prize;Andhra Pradesh;Government;central government;Coronavirus;Decemberఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!Night curfew in the state for Omicron building{#}East Godavari;Prime Minister;Gift;Prize;Andhra Pradesh;Government;central government;Coronavirus;DecemberFri, 24 Dec 2021 15:00:00 GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25నుంచి రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివాహాలకు 200మందికి మించి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే ఆ రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశేంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం తగ్గడం లేదు. 24గంటల వ్యవధిలోనే దేశంలో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 358మంది ఈ ప్రమాదకర వేరియంట్ బారిన పడ్డారు. 114మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 88మంది ఈ వైరస్ బారిన పడగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఢిల్లీలో 67, తెలంగాణలో 38కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి ఈ వైరస్ సోకింది.

ఇక దేశంలో గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 6వేల 650కరోనా కేసులు నమోదయ్యాయి. 7వేల 51మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 374మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 77వేల 516కాగా.. ఇప్పటి వరకు 4లక్షల 79వేల 133మంది కరోనా వైరస్ సోకి మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఇక ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకరికి, తూర్పుగోదావరి జిల్లాలో మరొకరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా ఈ వైరస్ సోకిన ఇద్దర్ని విశాఖలోని క్వారంటైన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కేసుల సంఖ్య 360కి చేరింది. తెలంగాణలో 38మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

మరోవైపు బల్గేరియాలో పదవీ విరమణ పొందిన వ్యక్తులు కరోనా టీకా వేయించుకుంటే వారికి నగదు బహుమతి ఇస్తామని ఆ దేశ ప్రధాని కిరిల్ పెట్కోల్ ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల వరకు వారికి పెన్షన్ తో పాటు 43.40డాలర్లు అదనంగా అందిస్తామని చెప్పారు. కాగా బల్గేరియాలో 27శాతం జనం మాత్రమే టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ లో ఆ దేశం చాలా వెనుకబడిపోయింది.







శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఏపీ లో 'శ్యామ్ సింగరాయ్' కి థియేటర్ల కరువు.. కారణం..?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>