PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined జాతీయ స్థాయిలో ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితుల్లో అస‌లు మోదీకి ప్ర‌త్యామ్నాయంగా నిలువ‌గ‌లిగే నాయ‌కులే లేర‌న్న‌ది ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు విస్తృత స్థాయిలో చేస్తున్న ప్ర‌చారం. స్థూలంగా చూస్తే ఇది నిజ‌మేన‌నిపిస్తుంది. ఎందుకంటే మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ పున‌ర్వైభ‌వం కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ ప్ర‌ధానంగా ఆధార‌ప‌డిన‌ రాహుల్, ప్రియాంక త‌మ నాయ‌క‌త్వ ప‌టిమ‌ను నిరూపించుకుంటేనే ఢిల్లీ పీఠం ద‌క్కించుకోగలిగేది. Third Front{#}Arvind Kejriwal;shiv sena party;Delhi;priyanka;Party;Congress;Bharatiya Janata Partyమూడో ఫ్రంట్ కు నేతృత్వం వ‌హించేదెవ‌రు..?మూడో ఫ్రంట్ కు నేతృత్వం వ‌హించేదెవ‌రు..?Third Front{#}Arvind Kejriwal;shiv sena party;Delhi;priyanka;Party;Congress;Bharatiya Janata PartyThu, 23 Dec 2021 20:51:30 GMT          జాతీయ స్థాయిలో ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితుల్లో అస‌లు మోదీకి ప్ర‌త్యామ్నాయంగా నిలువ‌గ‌లిగే నాయ‌కులే లేర‌న్న‌ది ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు విస్తృత స్థాయిలో చేస్తున్న ప్ర‌చారం. స్థూలంగా చూస్తే ఇది నిజ‌మేన‌నిపిస్తుంది. ఎందుకంటే మ‌రో జాతీయ పార్టీ కాంగ్రెస్ పున‌ర్వైభ‌వం కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ ప్ర‌ధానంగా ఆధార‌ప‌డిన‌ రాహుల్, ప్రియాంక త‌మ నాయ‌క‌త్వ ప‌టిమ‌ను నిరూపించుకుంటేనే ఢిల్లీ పీఠం ద‌క్కించుకోగలిగేది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ,షాల ఆధ్వ‌ర్యంలోని బీజేపీ కాంగ్రెస్ ముక్త భార‌త్ రాజ‌కీయ నినాదాన్నిపార్టీ విధానంగా మ‌లుచుకోవ‌డంతో కాంగ్రెస్ పార్టీకి దేశ‌వ్యాప్తంగా గ‌ట్టి స‌వాల్ ఎదుర‌వుతోంద‌ని చెప్పాలి. గ‌తంలో ఆ పార్టీకి చేదోడువాదోడుగా స‌హ‌క‌రించిన క‌మ్యూనిస్టుల  ప్రాబ‌ల్యం ఇప్పుడు లేదు. ప్ర‌స్తుతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్రాంతీయ పార్టీల అధినేత‌లెవ‌రికీ ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌భావం చూప‌గ‌లిగే చ‌రిష్మా లేదు. అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌న్నింటినీ కూడ‌గ‌ట్టి బ‌ల‌మైన కూట‌మిని ఏర్పాటు చేసే శ‌క్తియుక్తులు లేవు.
       
         ఇక బెంగాల్లో మోదీని రాజ‌కీయంగా ఎదిరించి నిలువ‌రించిన మ‌మ‌తా బెన‌ర్జీ బ‌లం సొంత రాష్ట్రానికే ప‌రిమితం. ఆమెకు ప్ర‌ధాని పీఠంపై ఆశ‌లున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేషకులు చెపుతున్నా, ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌గ‌ట్ట‌గ‌ల స్థాయి ఆమెకు ఉంద‌ని భావించ‌లేం. అంతేకాదు.. పూర్వాశ్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నేతే అయినా ఆమె ఆ పార్టీకి స‌హ‌క‌రిస్తున్న దాఖ‌లాలు లేవు. మ‌రోప‌క్క ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇత‌ర రాష్ట్రాల్లోను త‌న పార్టీని విస్త‌రించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిక‌రంగానే ఉన్నాఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండ‌గా, 3 రాష్ట్రాల్లో మాత్ర‌మే కాంగ్రెస్ అధికారంలో ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఎన్‌సీపీ, శివ‌సేన అధికార కూటమిలో భాగంగా ఉంది.  అయితే  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను మినహాయిస్తే మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ పార్టీనే. అంటే రాష్ట్రాల్లో అధికారం చేతులు మారితే జాతీయ స్థాయిలో లెక్క‌లు మార‌తాయ‌న్న‌మాట‌. అందుకే  బ‌ల‌హీనంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ ఈసారి స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ గ‌ట్టి ప‌ట్టుద‌లతో ఉంది. ఆ రాష్ట్రంలో త‌మ బ‌లం నిలుపుకోవాల‌ని బీజేపీ కూడా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. అంటే రానున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఇత‌ర రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ముఖ‌చిత్రం మ‌నం చూడ‌వ‌చ్చ‌న్న‌మాట‌.  మూడో కూట‌మి ఉంటుందా లేదా అన్న‌ది కూడా తేలిపోనుంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>