PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc521bf8a-9b8e-4f24-a21c-861f40f5d645-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganc521bf8a-9b8e-4f24-a21c-861f40f5d645-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే... అంతా ఠక్కున చెప్పే సమాధానం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం అని చెప్పేస్తారు. ఈ మధ్య కాలంలో మరో సమాధానం కూడా వినిపిస్తోంది. అదేమిటంటే... పార్టీ నేతలకు సంబంధించిన వివాహాది శుభకార్యాలు. అవును... నిజమే.. ఎంత పెద్ద ఉపధ్రవం వచ్చినా సరే... తాడేపల్లి ఇంటి నుంచి కాలు బయటపెట్టని ముఖ్యమంత్రి వైఎస్ జగన్... పార్టీ నేతలకు సంబంధించిన శుభకార్యాలకు మాత్రం తప్పని సరిగా హాజరవుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదు పెళ్లి వేడుకలకు జగన్ హాజరయ్యారు. ఇదే ఇప్Jagan{#}Tadepalli;marriage;Telangana Chief Minister;Jagan;Party;Governmentజగన్ సార్ కోసం ఉద్యోగుల వెయిటింగ్...!జగన్ సార్ కోసం ఉద్యోగుల వెయిటింగ్...!Jagan{#}Tadepalli;marriage;Telangana Chief Minister;Jagan;Party;GovernmentThu, 23 Dec 2021 17:24:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే... అంతా ఠక్కున చెప్పే సమాధానం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం అని చెప్పేస్తారు. ఈ మధ్య కాలంలో మరో సమాధానం కూడా వినిపిస్తోంది. అదేమిటంటే... పార్టీ నేతలకు సంబంధించిన వివాహాది శుభకార్యాలు. అవును... నిజమే.. ఎంత పెద్ద ఉపధ్రవం వచ్చినా సరే... తాడేపల్లి ఇంటి నుంచి కాలు బయటపెట్టని ముఖ్యమంత్రి వైఎస్ జగన్... పార్టీ నేతలకు సంబంధించిన శుభకార్యాలకు మాత్రం తప్పని సరిగా హాజరవుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే ఐదు పెళ్లి వేడుకలకు జగన్ హాజరయ్యారు. ఇదే ఇప్పుడు ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఓ వైపు పీఆర్‌సీ అమలు కోసం ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు రెండు నెలలుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరికి విసిగిపోయిన ఉద్యోగులు... నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు. ఇక ఉద్యోగ సంఘాల నేతలు అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే.. ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయటం లేదు.

ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైనప్పటికీ... పీఆర్‌సీ నివేదిక మాత్రం ఇవ్వటం లేదు. కేవలం లీకులతో సరిపెడుతోంది. పీఆర్‌సీ ఫిట్‌మెంట్ పర్సంటేజ్‌పై గతంలో అధికారుల కమిటీ ప్రకటించిన 14 శాతానికి మించి ఎంత ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికీ తుది నిర్ణయానికి రావటం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రితోనే చర్చించి తమ డిమాండ్లు సాధించుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉద్యోగులకు కలిసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ మాత్రం సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. దీంతో భేటీ రేపు ఉండొచ్చు... ఎల్లుండి ఉండొచ్చు అంటూ అటు పార్టీ నేతలు, ఇటు ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలను కవర్ చేస్తున్నారు. పీఆర్‌సీపై ప్రభుత్వ హామీ నమ్మిన ఉద్యోగ సంఘాల నేతలు తమ ఆందోళన విరమించారు. ఇదే ఇప్పుడు వారికి పెద్ద తలనొప్పిగా మారింది. హామీ ఏమైంది అంటూ ఉద్యోగులు నేతలను నిలదీస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెరిగింది.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పవర్ స్టార్ తో శ్యామ్ సింగ రాయ్ 2.. డైరక్టర్ రాహుల్ కామెంట్స్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>