PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-omicronb2ea2885-7742-44f7-a4bf-888714337619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-omicronb2ea2885-7742-44f7-a4bf-888714337619-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్... ఈ పేరు వింటే చాలు.. అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపేందుకు గతేడాది మార్చి నెలలో ఈ బ్రహ్మాస్త్రాన్ని కేంద్రం ప్రయోగించింది. దాదాపు రెండు నెలల పాటు ఎక్కడి వ్యవస్థ అక్కడే ఆగిపోయింది. వ్యాపారం అనే మాటే లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇక రోజు వారి కూలీల పరిస్థితి అయితే అత్యంత దారుణం. పూట గడవక నానా పాట్లు పడ్డారు. పట్టెడన్నం కోసం దాతల వైపు ఆశగా ఎదురు చూశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. చివరికి ఆంక్షల సడలించినప్పటికీ.. పరిస్థితిలో పomicron{#}software;Maharashtra;March;House;Coronavirus;central government;Telanganaమళ్లీ లాక్ డౌన్ తప్పదా...!మళ్లీ లాక్ డౌన్ తప్పదా...!omicron{#}software;Maharashtra;March;House;Coronavirus;central government;TelanganaThu, 23 Dec 2021 13:47:07 GMTలాక్ డౌన్... ఈ పేరు వింటే చాలు.. అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపేందుకు గతేడాది మార్చి నెలలో ఈ బ్రహ్మాస్త్రాన్ని కేంద్రం ప్రయోగించింది. దాదాపు రెండు నెలల పాటు ఎక్కడి వ్యవస్థ అక్కడే ఆగిపోయింది. వ్యాపారం అనే మాటే లేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇక రోజు వారి కూలీల పరిస్థితి అయితే అత్యంత దారుణం. పూట గడవక నానా పాట్లు పడ్డారు. పట్టెడన్నం కోసం దాతల వైపు ఆశగా ఎదురు చూశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. చివరికి ఆంక్షల సడలించినప్పటికీ.. పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వైరస్‌కు భయపడి... ప్రజలు బయటకు రాలేదు. ఇప్పటికీ సాఫ్ట్ వేర్ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానమే అవలంభిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయినా సరే సెకండ్ వేవ్ రూపంలో మరోసారి మహమ్మారి విరుచుకు పడింది. దీంతో ఈ సారి రాష్ట్రాలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించాయి. దాదాపు 15 రోజుల పాటు మళ్లీ ఆంక్షలు కొనసాగాయి.

ఇప్పుడు తాజాగా కరోనా కొత్త వేరియంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్... ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించింది. దీంతో ఒమిక్రాన్ కట్టడికి మరోసారి కఠిన చర్యలు తప్పేలా లేవు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 250 దాటేసింది. తెలంగాణలో అయితే 40 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా... తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో మరోసారి కర్ఫ్యూ విధింపు దిశగా నిర్ణయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. మరోసారి లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ  అమలు చేయాలనేది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించాలనేది కేంద్రం భావన. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంబరాలు జరుపుకోవద్దని ఆదేశించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం బూస్టర్ డోసులతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా కేంద్రం భావిస్తోంది.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>