PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ayodhya1346b6a3-689b-4d19-86de-2a748069d88f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ayodhya1346b6a3-689b-4d19-86de-2a748069d88f-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భగ్గుమన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని తన పేషీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఎన్నికల వేళ.. నిత్యం పర్యటనలతో బిజీ బిజీ గా ఉన్న ఆయన ఎందుకు తస పేషీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను వదలి పెట్టి అధికార గణంపై కోపం తెచ్చుకోవాల్సినంత పని వారు ఏం చేశారు ? ayodhya{#}Rishikesh;Kanpur;Rahul Gandhi;Yogi Adityanath;Supreme Court;Ayodhya;Allu Aravind;Uttar Pradesh;November;vegetable market;Indian;Kumaar;Bharatiya Janata Party;MLA;Hanu Raghavapudi;local language;Telangana Chief Minister;District;Congress;Pressఅయోధ్య రామయ్యా.... ఎవరు వీళ్లు? ఏమిటీ పని ?అయోధ్య రామయ్యా.... ఎవరు వీళ్లు? ఏమిటీ పని ?ayodhya{#}Rishikesh;Kanpur;Rahul Gandhi;Yogi Adityanath;Supreme Court;Ayodhya;Allu Aravind;Uttar Pradesh;November;vegetable market;Indian;Kumaar;Bharatiya Janata Party;MLA;Hanu Raghavapudi;local language;Telangana Chief Minister;District;Congress;PressThu, 23 Dec 2021 14:23:08 GMT

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భగ్గుమన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని తన పేషీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహానికి కారణం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయోధ్య రామాలయం సమీపంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక  ఇండియన్ ఎక్స్ ప్రెస్  ప్రచురించింది. అయోధ్యలోని రామాలయ స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ అధికారులు,  వారి బంధువులు భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కోంది.  ఈ లావాదేవీలు అక్రమం అని  పేర్కోంటూ.. ఆలయ నిర్మాణానికి అనుమతినిస్తూ నవంబర్ 9, 2019 నాటి  తీర్పును కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో వివరించింది. దీంతో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అలెర్ట్  అయ్యారు. సిబ్బందికి అదేశాలు జీరీ కావడం చకచకా జరిగిపోయింది.

యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) మనోజ్ కుమార్ సింగ్‌ను ఏమన్నారంటే.., “ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్తాపత్రిక నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు విచారణకు ఆదేశించాం. స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారిని విచారణ జరపాల్సిందిగా సిఎం కార్యాలయం కోరింది.  వారం రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని అదేశించాం అని ఆయన వివరించారు.

అయోధ్యలో స్థానిక ఎమ్మెల్యేలు, అయోధ్యలో  ప్రస్తుతం పనిచేస్తున్న వారు,  గతంలో పనిచేసిన బ్యూరోక్రాట్‌లు రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై భూ దందాకు పాల్పడ్డారు. 12 మంది ప్రభుత్వ అధికారులు, వారి బంధువులు ఆయోధ్యలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి ప్రముఖ వార్తా పత్రిక  ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ ఉదంతం పై పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ లావాదేవీలన్నీ కూడా 2019 న సుప్రీం కోర్టు తీర్పునకు ముందుగా జరిగాయని ఆ పత్రిక తెలిపింది.

 ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రతినిధులలో అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ్ కూడా ఉన్నారు. అయోధ్య నగర ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా; గోసాయిగంజ్ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ (ఇప్పుడు ఆయన అనర్హుడయ్యాడు), నాటి జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ ఝా,  రాష్ట్ర సమాచార కమిషనర్ హర్షవర్ధన్ షాహి,  ఓబీసీ కమిషన్ సభ్యుడు బలరామ్ మౌర్య,  ప్రస్తుతం కాన్పూర్ లో ఉన్న  సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆయుష్ చౌదరి,  మీరట్‌లో ఉన్న సర్కిల్ ఆఫీసర్ అరవింద్ చౌరాసియా,   ఉత్తర ప్రదేశ్  కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమాధర్ ద్వివేది, గంజా సుధాన్షు రంజన్‌తో సహా పలు వురు భూ  అక్రమ లావాదేవీలపై ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. దళిత గ్రామస్తుల నుంచి రూ. 6.38 లక్షలకు 21  బిట్ల  భూమిని స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ ప్రస్తుత మార్కెట్ లో రూ.4.25 కోట్ల నుంచి రూ.9.58 కోట్ల మధ్య ఉంది. ఎన్నికల వేళ కదా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు.  మతం ముసుకులో భారతీయ జనతా పార్టీ భూ దందాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు... అయోధ్య రామయ తండ్రీ... నిన్ను నీవే కాపాడుకోవాలయ్యా.... మేం మానవులం. మాకూ ఆశలుంటాయి



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న తమన్నా..!

ఆర్ ఆర్ ఆర్ తో పోలిస్తే రాధే శ్యామ్ డల్ గా ఉందే!!

కేటీఆర్‌కు ప‌ట్టాభిషేకం ఇప్ప‌ట్లో లేనట్టేనా..?

నాని శ్యామ్ సింగ రాయ్.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్..!

తెలంగాణకు ఒమిక్రాన్ అలర్ట్...!

ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ ట్రైలర్..!

మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?

కేటీఆర్ మెద‌క్ ఎంట్రీ.. హ‌రీష్ హ‌ర్ట్ అయ్యారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>