MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/1983-world-cup3c94ab54-7efa-431a-854a-11c19b57dbb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/1983-world-cup3c94ab54-7efa-431a-854a-11c19b57dbb8-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో క్రికెట్ ఓ మ‌తం. విజ‌య‌వంత‌మైన క్రికెట్ క్రీడాకారులంటే ప్ర‌జ‌ల్లో సినిమా న‌టులను మించిన అభిమానం. జ‌నాల్లో ఈ ఆట‌కు ఇంత‌టి క్రేజ్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం 1983 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో క‌పిల్‌దేవ్ కెప్టెన్సీలో భార‌త‌ జ‌ట్టు విజ‌యం. ఆ విజ‌యం ఎంత‌టి ప్ర‌త్యేక‌మైన‌దంటే న‌ల‌భై ఏళ్ల త‌రువాత దానిపై బాలీవుడ్ సినిమా తెర‌కెక్కేంత‌. 1983 world cup{#}jeevitha rajaseskhar;Akkineni Nagarjuna;Chitram;Audi;bollywood;Cricket;Cinemaభార‌త క్రికెట్ గ‌తిని మార్చిన టోర్నీ అది..?భార‌త క్రికెట్ గ‌తిని మార్చిన టోర్నీ అది..?1983 world cup{#}jeevitha rajaseskhar;Akkineni Nagarjuna;Chitram;Audi;bollywood;Cricket;CinemaThu, 23 Dec 2021 22:00:00 GMT           భార‌త్‌లో క్రికెట్ ఓ మ‌తం. విజ‌య‌వంత‌మైన క్రికెట్ క్రీడాకారులంటే ప్ర‌జ‌ల్లో సినిమా న‌టులను మించిన అభిమానం. జ‌నాల్లో ఈ ఆట‌కు ఇంత‌టి క్రేజ్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం 1983 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో క‌పిల్‌దేవ్ కెప్టెన్సీలో భార‌త‌ జ‌ట్టు విజ‌యం. ఆ విజ‌యం ఎంత‌టి ప్ర‌త్యేక‌మైన‌దంటే న‌ల‌భై ఏళ్ల త‌రువాత దానిపై బాలీవుడ్ సినిమా తెర‌కెక్కేంత‌. అప్ప‌టిదాకా అంత‌ర్జాతీయ క్రికెట్లో భార‌త‌ జ‌ట్టుకు చెప్పుకోద‌గ్గ విజ‌యాలు లేవు. అందుకే జ‌ట్టు విజ‌యంపై ఎవ‌రికీ న‌మ్మ‌కాలు లేవు. ఎందుకంటే అంత‌కుముందు జ‌రిగిన రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల్లోనూ క‌లిపి భార‌త్ గెలుపు దక్కించుకుంది ఒకే ఒక్క మ్యాచ్ లో. అదీ బ‌ల‌హీన‌మైన ఈస్ట్ ఆఫ్రికా మీద మాత్ర‌మే. అందుకే భార‌త్ జ‌ట్టు గెలిస్తే ఒక‌టికి అర‌వై రెట్లు ఇస్తామంటూ అప్ప‌ట్లో బెట్టింగ్‌లు జ‌రిగాయి. అంతేకాదు ప‌లువురు క్రికెట్ పండితులూ భార‌త్ జ‌ట్టును చుల‌క‌న చేస్తూ వ్యాఖ్య‌లు చేశారు. అయితే క‌పిల్ డెవిల్స్ మాత్రం పోరాడితే పోయేదేమీ లేద‌నుకుంటూ ఆత్మ‌విశ్వాసం గుండెల నిండా నింపుకుని బ‌రిలోకి దిగారు. అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ అత్యంత ప‌టిష్ట‌మైన జట్లపై జైత్ర‌యాత్ర చేస్తూ ఇంగ్లండ్ లో జ‌రిగిన ఈ టోర్నీలో ఫైన‌ల్లో వెస్టిండీస్‌ను ఓడించి క‌ప్ ను చేజిక్కించుకున్నారు. త‌మ‌ను చిన్న‌చూపు చూసిన‌ అంద‌రికీ అప్ప‌ట్లోనే ల‌గాన్ ను మించిన సినిమా చూపించారు. ఈ టోర్నీలో జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు జ‌ట్టు నాయ‌కుడు క‌పిల్‌దేవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 175 ప‌రుగులు చేసి జట్టును గెలిపించడాన్నిక్రీడాభిమానులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేరు.
 
         దేశంలో క్రికెట్ క్రీడ‌కు విప‌రీతమైన‌ ఆద‌ర‌ణను తెచ్చిపెట్టిన ఈ విజ‌య‌గాథ నేప‌థ్యంలో క‌పిల్ జీవిత క‌థ ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్ మూవీ తెర‌కెక్కింది. ‘83’  పేరుతో వస్తున్న ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్‌సింగ్, దీపికా ప‌దుకొణె కీల‌క పాత్ర‌లు పోషించారు. క్రిస్మ‌స్ కానుకగా డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. మంచి అంచ‌నాల‌తో వ‌స్తున్న ఈ చిత్రం మ‌రో ల‌గాన్ మాదిరి విజ‌యాన్నందుకుంటుందేమో చూడాలి.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

అమరావతి : జగన్ కు షాక్ తప్పదా ?

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!

కిడ్నీ వ్యాధి: ముందస్తు సంకేతాలు ఇవేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>