PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaeb01cc8-c8b4-4b4d-b40c-03f7aba16204-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpaeb01cc8-c8b4-4b4d-b40c-03f7aba16204-415x250-IndiaHerald.jpgనెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాలు ఏ మాత్రం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోటలు...వైసీపీకి ముందు కాంగ్రెస్ హవా కొనసాగేది...కానీ ఈ రెండు చోట్ల టీడీపీ పెద్దగా సత్తా చాటలేదు. అసలు ఆ పార్టీకి పెద్ద పట్టు కూడా లేదు. అందుకే ఇక్కడ వైసీపీ హవానే కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్ల వైసీపీనే గెలిచింది. అయితే రెండు ఎన్నికల్లోనూ అభ్యర్ధులని మార్చింది. ysrcp{#}prabhakar;Jagan;Congress;Nellore;yv subbareddy;Chintamaneni Prabhakar;Parliment;Parakala Prabhakar;Y V Subbareddy;Hanu Raghavapudi;Reddy;TDP;YCPనెల్లూరు-ఒంగోలు వైసీపీలో మళ్ళీ మార్పులు ఉంటాయా?నెల్లూరు-ఒంగోలు వైసీపీలో మళ్ళీ మార్పులు ఉంటాయా?ysrcp{#}prabhakar;Jagan;Congress;Nellore;yv subbareddy;Chintamaneni Prabhakar;Parliment;Parakala Prabhakar;Y V Subbareddy;Hanu Raghavapudi;Reddy;TDP;YCPThu, 23 Dec 2021 02:00:00 GMTనెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాలు ఏ మాత్రం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోటలు...వైసీపీకి ముందు కాంగ్రెస్ హవా కొనసాగేది...కానీ ఈ రెండు చోట్ల టీడీపీ పెద్దగా సత్తా చాటలేదు. అసలు ఆ పార్టీకి పెద్ద పట్టు కూడా లేదు. అందుకే ఇక్కడ వైసీపీ హవానే కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు చోట్ల వైసీపీనే గెలిచింది. అయితే రెండు ఎన్నికల్లోనూ అభ్యర్ధులని మార్చింది.

అభ్యర్ధులని మాత్రం మార్చిన..గెలుపు మాత్రం మారలేదు. గెలుపు వైసీపీకే దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు చోట్ల వైసీపీ మళ్ళీ అభ్యర్ధులని మారుస్తుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. నెల్లూరు విషయానికొస్తే...2009లో కాంగ్రెస్ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గెలిచారు. అయితే మధ్యలో ఆయన కాంగ్రెస్‌ని వదిలి వైసీపీలో చేరి 2012 ఉపఎన్నికలో నెల్లూరు బరిలో నిలిచి గెలిచారు.

ఇక 2014 ఎన్నికల్లో మేకపాటి మరొకసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో టీడీపీపై గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఈయనకు టిక్కెట్ దక్కలేదు. అప్పటికే మేకపాటి ఫ్యామిలీకి రెండు టిక్కెట్లు ఇచ్చారు. దీంతో మేకపాటికి సీటు ఇవ్వలేదు. అప్పటికప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీటు ఇచ్చారు. జగన్ గాలిలో ఆయన భారీ మెజారిటీతో గెలిచేశారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తారా? లేదా? అనేది తెలియడం లేదు.

ఇటు ఒంగోలు విషయానికొస్తే...2014లో వైసీపీ నుంచి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. 2019 ఎన్నికలోచ్చేసరికి సుబ్బారెడ్డికి సీటు ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు ఇచ్చారు. జగన్ గాలిలో మాగుంట ఒంగోలు పార్లమెంట్‌లో భారీ మెజారిటీతో గెలిచేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మాగుంటకు ఒంగోలు సీటు దక్కుతుందా? అంటే చెప్పలేం...ఎందుకంటే మళ్ళీ సీటు మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>